దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) మంగళవారం నష్టాలతో ముగిశాయి. నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) ఎక్స్‌పైరీ కారణంగా ట్రేడర్లు లాభాలను రియలైజ్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈ ఒడిదొడుకుల ప్రభావంతో సూచీలు రోజంతా దబ్బుల మధ్యనే నిలిచాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313.7 పాయింట్లు పడుతూ 84,587.01 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 74.7 పాయింట్ల నష్టంతో 25,884.8 వద్ద ముగిసింది. నిఫ్టీకి 26,000 స్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. రంగాల వారీగా చూస్తే, రియల్టీ మరియు పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, ఐటీ మరియు మీడియా రంగ షేర్లలో నష్టాలు నమోదయ్యాయి.
Read also: Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock markets closed in losses
ఇండెక్స్ 0.19% మేర లాభపడ్డాయి
Stock Markets: ప్రధాన సూచీలు నష్టపోయినా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సానుకూలంగా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.36%, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.19% మేర లాభపడ్డాయి. అదనంగా, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తుండటం కూడా మార్కెట్లకు ఒత్తిడిని సృష్టించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌లో ట్రెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్ నష్టపోయగా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్ వంటి షేర్లు లాభపడ్డాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: