సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) బలమైన బుల్ రన్‌తో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, దేశీయ మదుపరుల నమ్మకం సూచీలను భారీ లాభాల దిశగా నడిపించింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడం మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచింది.
Read also: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock market
ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 638 పాయింట్లు పెరిగి 85,567.48 వద్ద స్థిరపడింది. అదే విధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 26,161.60 స్థాయికి చేరుకుంది. ప్రధాన సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.17 శాతం, మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.84 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
రంగాల వారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ 2 శాతం పైగా పెరిగి టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. మెటల్ రంగం కూడా బలంగా లాభపడింది. మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీ 26,050–26,100 స్థాయిలను దాటడం బలమైన సంకేతంగా భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ముడి చమురు ధరల మార్పులపై మదుపరులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: