దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల దిశగా సాగాయి. బుధవారం ట్రేడింగ్‌లో ఐటీ, ఆటో, ఫార్మా రంగాల్లో బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ (BSE SENSEX) 595 పాయింట్లు పెరిగి 84,466 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 180 పాయింట్లు లాభపడి 25,875 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గడం, బలమైన ఆర్థిక సూచీలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం మదుపరుల నమ్మకాన్ని పెంచాయి.
Read also: Tata: మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రానున్న రోజుల్లో
టీసీఎస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా వంటి షేర్లు లాభాల్లో ఉండగా, టాటా స్టీల్, టాటా మోటార్స్ మాత్రం స్వల్ప నష్టాలను చవిచూశాయి. మరోవైపు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 6 పైసలు తగ్గి 88.62 వద్ద ముగిసింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు రానున్న రోజుల్లో రూపాయి మారకపు విలువపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న వారాల్లో రూపాయి 88.40 నుంచి 88.85 శ్రేణిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: