భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగిన ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాలు ఖరారు చేయడంతో సెన్సెక్స్ 436.41 పాయింట్లు కోల్పోయి 84,666.28 వద్ద, నిఫ్టీ 120.90 పాయింట్లు తగ్గి 25,839.65 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత బియ్యంపై కొత్త సుంకాలు విధించవచ్చని వార్తలు మార్కెట్ సెంటిమెంట్ ను మరింత బలహీనపరిచాయి. హెవీవెయిట్ షేర్లు, ఐటీ, ఆటో, ఫార్మా రంగాల్లో షేర్లలో 1 శాతం వరకు నష్టాలు నమోదు అయ్యాయి, అయితే కొన్ని షేర్లు లాభాల్లో ముగిసి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి.
Read also: Trump: చైనాకు Nvidia AI చిప్‌లను విక్రయించడానికి సిద్ధం: ట్రంప్

Stock markets closed in losses
ప్రధాన సూచీలు పతనమైనప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.32% లాభపడి, స్మాల్ క్యాప్ 1.14% లాభపడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, కరెన్సీ కదలికలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు బలపడి 89.82 వద్ద ముగిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: