Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) ఈ రోజు ఉత్సాహభరిత వాతావరణాన్ని కనబరిచాయి. వరుసగా రెండు రోజుల నష్టాల తర్వాత మదుపరులు తిరిగి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రారంభం నుంచే సానుకూల ధోరణి కొనసాగగా, సెన్సెక్స్ 590 పాయింట్లు ఎగసి 77,100 పాయింట్ల వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 23,470 వద్ద ట్రేడింగ్ ముగించింది. అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దేశీయంగా పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు బలంగా దూసుకుపోయాయి. అలాగే ఏషియన్ పేయింట్స్, (Asan paints) ఎల్ అండ్ టీ, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ కూడా గణనీయమైన లాభాలు నమోదు చేశాయి.
AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి లోకేశ్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
టాటా మోటార్స్
మరోవైపు, టాటా మోటార్స్, (Tata motors) ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ వంటి కొన్ని షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగియగా, ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.10 వద్ద స్థిరంగా కొనసాగింది. Stock Market మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటీవల చోటుచేసుకున్న కరెక్షన్ తర్వాత తక్కువ స్థాయిల్లో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్ తిరిగి బలపడిందని విశ్లేషిస్తున్నారు. వచ్చే రోజుల్లో కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ వడ్డీ రేటు (Interest) సంకేతాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.
ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ముగిశాయి?
లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 590 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు పెరిగాయి.
ఏ కంపెనీలు లాభపడ్డాయి?
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పేయింట్స్, ఎల్ అండ్ టీ, ట్రెంట్, అదానీ పోర్ట్స్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: