భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి, (Stock market) తర్వాత నెమ్మదిగా కోలుకుని లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు (Stock market) పెరిగి 81,700 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది.
ప్రపంచ మార్కెట్లలో క్షీణత కారణంగా భారతీయ మార్కెట్లు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే, త్వరగా కోలుకుని లాభాలు పొందాయి. రూపాయి కూడా నిన్నటి పోలికలో 21 పైసలు తగ్గి రూ.87.16 వద్ద ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 23 నష్టాల్లో, 7 స్టాక్స్ పెరుగుదల చూపిస్తున్నాయి. ఎయిర్‌టెల్, ఎన్‌టిపిసి, జొమాటో షేర్లు 1% పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా షేర్లు 1.5% తగ్గాయి. నజరా టెక్నాలజీస్, డెల్టాకార్ప్, సీఎస్‌బీ బ్యాంక్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ నష్టాల్లో ఉన్నాయి.
నిఫ్టీ 50 స్టాక్స్‌లో 26 నష్టంలో, 24 లాభంలో ఉన్నాయి. NSE మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సూచీలు 1% వరకు తగ్గాయి. FMCG, IT, రియాలిటీ సూచీలు లాభాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు జపాన్ నిక్కీ 1.52% తగ్గి 42,883 వద్ద, కొరియా కోస్పి 1.86% తగ్గి 3,092 వద్ద ముగిసింది. హాంకాంగ్ హాంగ్‌సేంగ్ 0.42% తగ్గి 25,016 వద్ద, షాంఘై కాంపోజిట్ 0.056% తగ్గి 3,725 వద్ద ముగిసింది.
అమెరికాలో ఆగస్టు 19న డౌ జోన్స్ 0.023% పెరిగి 44,922 వద్ద, నాస్‌డాక్ 1.46% పెరిగి 21,315 వద్ద, ఎస్ & పి 500 0.59% తగ్గి 6,411 వద్ద ముగిసింది. FIIలు రూ.634.26 కోట్ల, DIIలు రూ.2,261.06 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.
Read also :