దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వారాంతం శుక్రవారం లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం బలహీనంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి కొనుగోళ్లు చురుకుగా మారడంతో సూచీలు పాజిటివ్ టెర్రిటరీలో ముగిశాయి. బ్యాంకింగ్,(Banking) ఫార్మా, ఆటో రంగాల షేర్లు మెరుస్తుండగా, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (sensex) 329 పాయింట్లు పెరిగి 82,501 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 25,285 వద్ద స్థిరపడ్డాయి.
Silver Price : వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్

Stock Market
ట్రేడింగ్ హైలైట్స్
- ప్రారంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లు తగ్గి 82,075 వద్ద ప్రారంభమైంది.
- కొద్దిసేపట్లోనే కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడేలో 82,654 గరిష్ఠాన్ని తాకింది.
- నిఫ్టీ కూడా 25,331 స్థాయిని తాకిన తర్వాత కొంత లాభం కాపాడుకుంది.
రంగాల ప్రదర్శన
- ఎస్‌బీఐ షేరు 2% పైగా ఎగసి మార్కెట్‌ను లీడ్ చేసింది.
- మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ ఒక్క శాతం పైగా లాభపడ్డాయి.
- టాటా స్టీల్ 1.5% తగ్గింది.
- టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాల తర్వాత 1% వరకు నష్టపోయింది.
రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్, (Health care) బ్యాంకింగ్ సూచీలు ఒక శాతం వరకు బలపడగా, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాలు సగం శాతం మేర ఎగశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.4%, స్మాల్‌క్యాప్ సూచీ 0.6% లాభపడింది.
అంతర్జాతీయ ప్రభావం
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఆశావహ సంకేతాలు, అలాగే భారత్-యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు కావచ్చన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. Stock Market ఈ పరిణామాల ప్రభావంతో టెక్స్‌టైల్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 15-17% వరకు దూసుకుపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: