ఎన్నికల ఫలితాల ప్రభావం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే స్పష్టత రావడంతో, భారత స్టాక్ మార్కెట్లు(Stock market) భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజంతా కొనసాగడం వల్ల, సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్84.11 పాయింట్లు పెరిగి 84,562.78 వద్ద స్థిరపడింది. అదే సమయంలో, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30.90 పాయింట్ల లాభంతో 25,910.05 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీహార్ ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు మొదట్లో అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమై ఒకానొక దశలో 400 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే, ఎన్డీఏ సులువుగా గెలుస్తుందనే అంచనాలు బలపడటంతో మార్కెట్‌లో సానుకూలత పెరిగింది. కనిష్ట స్థాయి నుంచి సూచీ ఏకంగా 550 పాయింట్లకు పైగా పుంజుకుని లాభాల బాట పట్టింది.
Read also: ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

రంగాలవారీగా భిన్న స్పందన
ఆషికా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం, భారత మార్కెట్లు ఈరోజు రోలర్-కోస్టర్ సెషన్‌ను చవిచూశాయి. నిఫ్టీ పదునైన కదలికలను ప్రదర్శించింది. ఉదయం 26,000 స్థాయిని పరీక్షించినప్పటికీ, ఆ తర్వాత ఒత్తిడికి లోనైంది. రాజకీయంగా కీలకమైన ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రోజంతా మార్కెట్లలో అస్థిరత కనిపించింది. రంగాలవారీగా చూస్తే భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లలో విక్రయాల ఒత్తిడి ఉన్నప్పటికీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు లాభపడగా, నిఫ్టీ ఐటీ, ఆటో సూచీలు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ షేర్లలో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్,(Axis Bank) ఎస్‌బీఐ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ వంటివి ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ వంటి షేర్లు నష్టాలను చవిచూశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: