దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వార్తలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటకు గురైన సూచీలు (Stock Market) చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్ (Sensex) దాదాపు 200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ (Nifty) 25,450 మార్క్ దాటింది.
రంగాల వారీగా మార్కెట్ పనితీరు
ఈ ఉదయం 83,306.81 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికే ఒత్తిడికి గురైంది. ఒక దశలో 83,015.83 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయిన సూచీ చివర్లో కాస్త కోలుకుంది. మార్కెట్ (Stock Market) ముగిసే సమయానికి 193.42 పాయింట్లు లాభపడి 83,432.89 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 25,331.65 – 25,470.25 మధ్య కదలాడింది. చివరకు 55.70 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 85.38గా స్థిరపడింది.

అంతర్జాతీయ ప్రభావాలు & ట్రేడ్ డీల్ అంశం
ఆటోమొబైల్, టెలికాం, లోహ రంగాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఫార్మా, చమురు, ఐటీ, రియల్టీ, మీడియా రంగ సూచీలు 0.4 నుంచి 1 శాతం మేర పెరిగాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్ షేర్లు రాణించగా.. ట్రెంట్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు స్వల్పంగా పెరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: UPI-Based Bank: భారత్‌లో మొట్టమొదటి UPI ఆధారిత బ్యాంక్