వైజాగ్ లో నివేదిక రూపొందించే పనిలో సిలైన్ ఆఫ్ షోర్ డైవింగ్ సంస్థ
Hyderabad: శ్రీశైలం (SriSailam) ప్రాజెక్ట్ లోని ప్లంజ్ పూల్ వద్ద నీటి విడుదల వల్ల కలిగే కోత స్థాయిని అంచనా వేయడానికి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సూచనల మేరకు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న సిలైన్ ఆఫ్షోర్ డ్రైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే గురువారం ముగిసింది. శీశైలం జలాశయం భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న సిలైన్ ఆఫ్షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 14 మంది నిపుణుల బృందం అత్యాధునిక పరికరాలతో ప్లాంజ్ పూల్ మరియు సిలిండర్లపై వీడియోగ్రాఫిక్ సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా 2009 వరదల ప్రభావం, భవిష్యత్ ప్రమాదాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో దీనిని జరిపారు.

శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ స్థితిని అంచనా వేసిన గుణాత్మక సర్వే పూర్తి
శ్రీశైలం జలాశయం ప్లంజ్ ఫుల్ అధ్యయనం చేయడానికి 8 మంది డైయింగ్ టీమ్ 8 మంది హెల్పర్ల సహాయంతో 13 రోజులు నిర్వహించారు. కాంక్రీట్,ఉక్కు నిర్మాణాలకు జరిగిన నష్టాన్ని అర్థం చేసుకోవడానికి, ఆనకట్ట దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అవసరమైన మరమ్మతులను ప్లాన్ చేయడానికి ఈ సర్వే చాలా కీలకమైనదని సిడబ్ల్యుపిఆర్ఎస్ (CWPRS) బృందం తెలిపింది. పూల్(గొయ్యి) ఎంత మేర ఏర్పడిందనే దానిపై నీటి అడుగులోనే దాదాపు 10 రోజులుగా ఫోటో, వీడియోలు గ్రఫీని డైయింగ్ టీమ్ చేసిందని తెలిపారు. సర్వే ముగించి పూర్తి నివేదిక రూపొందించడానికి సిలైన్ ఆఫ్షోర్ డ్రైవింగ్ టీమ్ వైజాగ్ (Offshore Driving Team Vizag) వెళ్లినది, ప్లంజ్ పుల్ సమగ్ర నివేదికను మూడు వారాలలో నీటిపారుదలశాఖ అధికారులకు అందించనున్న సర్వే టీమ్ తెలిపింది. శ్రీశైలంలో ఏప్రిన్ 169 మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్ పూల్ 122 మీటర్ల వరకు ఉంది. అంటే ఏప్రాన్ కన్నా లోతుకు దాని సమాంతరంగా ఈ గొయ్యి ఏర్పడింది. అది విస్తరిస్తూ ఉంది. శ్రీశైలం (SriSailam) ప్రాజెక్టులో అత్యంత లోతైన ఫౌండేషన్ తొమ్మిదో బ్లాకులో 134 మీటర్ల వద్ద ఉంది.
స్పిల్‌వే వద్ద నీటి ఉధృతి వల్ల ప్లంజ్ పూల్ లోతు పెరుగుదల, నిరంతర పర్యవేక్షణ కీలకం
ప్రస్తుతం ప్లంజ్ పూల్ దాని కన్నా 12 మీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని డ్యాం భద్రతా నిపుణులు పేర్కొన్నా ప్లంజ్ పూల్ విస్తరించకుండా చర్యలు అవసరమని చెబుతున్నారు. స్పిల్ వే మీదుగా ఉదృతంగా వచ్చి పడే నీటి ప్రవాహం వల్ల తీవ్ర కోత ఏర్పడుతోంది. క్రమంగా గొయ్యి పెరుగుతోంది. 1984 లో ప్రారంభ దశలోనే ఈ సమస్యను గుర్తించారు. స్పిల్ వే ఫౌండేషన్ కు, ఏప్రాన్ కు నష్టం జరగకుండా చూడాలని భావించారు.
ఏప్రాన్ పక్కనే స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 1.98 వ్యాసం, 18 మీటర్ల ఎత్తుతో 62 సిలిండర్లలో కాంక్రీటు నింపి 198587 సంవత్సరాల మధ్య వీటిని ఏర్పాటు చేశారు. ఆ సిలిండర్లలో 20 ధ్వంసమైనా వాటిని మార్చలేదు. దెబ్బతిన్న సిలిండర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే కొంత వరకు ప్లంజ్ పూల్ స్పిల్ వే ఫౌండేషన్. దాకా విస్తరించకుండా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 12 సిలిండర్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఏప్రిన్ లోకి రహదారి నిర్మించాల్సి ఉంది. స్పిల్ వే దిగువన కుడి, ఎడమ కొండ గట్లు సైతం జారిపోతున్నాయి. ఈ కొండల వాలుకు క్రీటింగు చేయాల్సి ఉందని కోత అంచనావేసే అధికారులు అభిప్రాయడుతున్నారు.
Read also: PRC: ఆప్కో ఉద్యోగులకు 2022 పిఆర్సీ అమలు