జాతీయ మహిళా సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తిరుపతి రూరల్ : మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సుసాధ్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Patrudu) అన్నారు. తొలి మహిళా సాధికారతపై పార్లమెంట్, శాసనసభ కమిటీల జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తి చేయడంపై సంతృప్తి వ్యక్తం చేసారు. మహిళా సాధికారత సదస్సులో చేసిన తీర్మానాలు కొత్త ఆత్మ విశ్వసానికి శ్రీకారం చుట్టాయన్నారు. మహిళల సమాన హక్కులు, రాజకీయాలలో మరింత ప్రాతినిధ్యం విద్య, ఉపాధి,
ఆర్థిక రంగాలలో అవకాశాలు, సురక్షిత సమాజ నిర్మాణం, ఇవన్నీ కేవలం నినాదాలు కావని, మనం సాధించాల్సిన లక్ష్యాలని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సాధికారత (Women Empowerment) కు పునాది వేసిన దార్శనికులు అల్లూరి సీతారామరాజు అని, ఆ దారిలో ముందుకు బలపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని తెలిపారు.
ప్రజల సమస్యలను పరిష్కరించే మార్గాలను కనుగొని
మహిళా శక్తి మనకు ప్రగతిశక్తి అని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకున్న దిశలో వినియోగించకలిగితే మన దేశం మరింత బలపడుతుందన్నారు. ఈ సదస్సులో తీసుకున్న ఆలోచనలు, తీర్మానాలు కేవలం కాగితాలలోనే కాకుండా ప్రజల జీవితాలలో మార్పులు తీసుకు రావటానికి ఉపయోగపడాలన్నారు.
ప్రజా ప్రతినిధులుగా మనం కేవలం హాజరుకావడం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించే మార్గాలను కనుగొని, వాటటిని అమలు చేయడమే ప్రధాన బాధ్యత ఉండాలన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల (Political fields) లో సమగ్ర భాగస్వామ్యం కలిగి ఉండాలన్నారు.

మహిళా సాధికారతపై శాసనసభ కమిటీ
చంద్రయాన్-3 (Chandrayaan-3) లో మహిళా శాస్త్రవేత్తల విజయాలు, ఎన్డీఎలో 17 మహిళా కెడెట్స్ తొలిసారిగా పట్టభద్రులుగా అవతరించడం, చెనాబ్ వంతేన ప్రాజెక్టు ప్రొపెసర్ జి. మాధవీలత 17వ సంవత్సరాల కృషి అని గుర్తు చేసారు. మహిళా సాధికారతపై శాసనసభ కమిటీ స్థాపన మహిళా సాధికారతపై శాసనసభ కమిటీ స్థాపన 1987లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైందని భారత పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి తెలిపారు.
1997లో మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ స్పష్టమైన, కీలకమైన లక్ష్యంతో ఉనికిలోకి వచ్చిందన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్ఫర్ భారత్ ద్వారా భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తన (Digital transformation) కోసం కృషి చేస్తాయని, ఆర్థిక వ్యవస్థ, పాలన, ఉపాధిని పునఃనిర్మించటానికి ఈ చొరవలను భాగస్వామ్యం చేస్తామని ప్రతిజు చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు.
డిజిటల్ ప్రదేశంలో సమానత్వం వైపు ముందుకు వెళ్ళేలా
అన్ని వయస్కుల మహిళలకు డిజిటల్ విద్యను ప్రోత్సహించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించి, డిజిటల్ ప్రదేశంలో సమానత్వం వైపు ముందుకు వెళ్ళేలా చేస్తామన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మహిళలలో గణితంను ప్రోత్సహించడానికి, సైబర్ నేరాలు, మోసాలు గురించి మహిళలలో అవగాహన కల్పిస్తామన్నారు. సమాజంలో ముఖ్య పాత్రధారులు మహిళలే అని డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణంరాజు తెలిపారు.
ఉపనిషత్తులు, పురాణాలు, మైత్రేయి గారి వంటి ప్రాచీన తత్త్వజ్ఞానుల శిక్షణల ఆధారంగా మహిళా సాధికారతపై ఇచ్చిన ప్రసంగాలను ప్రశంసించారు. లోకససభ స్పీకర్ ఓం బిర్లా రిమార్కులపై అభినందనలతో భారత్లో లింగ సమానతా ర్యాంక్, మెరుగుదల అవసరం ఉందన్నారు. 1997 ఏఫ్రిల్ 29న 11వ లోకసభలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత కమిటీ దేశంలో మహిళా సాధికారత ఇక ప్రధాన మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: