ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ సంస్థల కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ నగరంలో తాజాగా మరో రెండు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అడుగుపెట్టాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్ (Sonoco Products), జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్ (EBG Group) హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను అధికారికంగా ప్రారంభించాయి.
Read Also: TG North East: ఈశాన్యంతో తెలంగాణ కొత్త అధ్యాయం
సొనోకో ప్రోడక్ట్స్, ఈబీజీ గ్రూప్
ఈ పరిణామం హైదరాబాద్ వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలో అత్యాధునిక ఐటీ (IT) పెర్ఫార్మెన్స్ హబ్‌ను ప్రారంభించిన సొనోకో ప్రోడక్ట్స్, తాజాగా తమ కార్యకలాపాలను ఒక శాశ్వత భవనంలోకి మార్చింది.
దీనితో పాటు, హైదరాబాద్‌లో ‘ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)’ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రాజీవ్ అంకిరెడ్డిపల్లి వెల్లడించారు.మరోవైపు వెల్‌నెస్, మొబిలిటీ, టెక్నాలజీ, రియల్టీ వంటి బహుళ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈబీజీ గ్రూప్.. హైదరాబాద్‌లోని డల్లాస్ సెంటర్‌లో ‘ఈబీజీ పవర్‌హౌస్’ను ప్రారంభించింది.
ఈ కేంద్రం అభివృద్ధి కోసం రాబోయే రెండేళ్లలో 70 లక్షల డాలర్లు (రూ.6,160 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సంస్థల రాకతో స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: