Social Media: సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే వారికి ఒక ఆసక్తికరమైన అవకాశం లభించింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో గంటల తరబడి సమయం గడిపే వారికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగ ప్రకటన వెలువడింది. మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ విరాజ్ శేత్ విడుదల చేసిన ఈ పోస్టు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఈ పోస్టులో ఆ ఉద్యోగానికి “డూమ్-స్క్రోలర్”(Doom-Scroller) అనే పదవిని సూచించారు. రోజుకు కనీసం ఆరు గంటలపాటు సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడం, అలాగే ట్రెండ్స్‌ను గుర్తించి విశ్లేషించగల సామర్థ్యం ఉండాలి. ఇది కేవలం అలవాటుగా కాకుండా, వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకునే నైపుణ్యం అవసరమని ఆయన వివరించారు.
అర్హతలు:
- హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం
- సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌పై మంచి అవగాహన
- క్రియేటర్ కల్చర్ పట్ల ఆసక్తి
- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో పని చేసే నైపుణ్యం
- ముంబైలో ఫుల్‌టైమ్ విధానంలో పనిచేయగలగాలి

ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో(Social Media) విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు యూజర్లు సరదాగా “ఇప్పటివరకు సమయం వృథా చేస్తున్నాననుకున్నా, ఇప్పుడు అదే స్కిల్ అవుతుంది” అంటుండగా, మరికొందరు “రోజుకు 19 గంటలు స్క్రోల్ చేస్తా… నాకు పర్ఫెక్ట్ జాబ్ కదా?” అని స్పందిస్తున్నారు. ఇంకొందరు “ఈ ఉద్యోగం గురించి మా అమ్మకి చెప్పాలి, స్క్రోలింగ్ కూడా కెరీర్ అవుతుందని” అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.
“డూమ్-స్క్రోలర్” జాబ్ అంటే ఏమిటి?
ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో రోజుకు గంటల తరబడి స్క్రోల్ చేస్తూ, కొత్త ట్రెండ్స్‌ను గుర్తించి విశ్లేషించే ఉద్యోగం.
ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏమిటి?
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం, సోషల్ మీడియా అవగాహన, క్రియేటర్ కల్చర్‌పై ఆసక్తి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడగలగడం, ముంబైలో ఫుల్‌టైమ్ పని చేసే సామర్థ్యం అవసరం.
Read hindi news: hindi.vaartha.com
Read also: