దేశీయంగా వెండి ధరలు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MOFSL) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో వెండి ధర ₹1.5 లక్షలు కిలోకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఏడాది వెండి ధరలు 37 శాతం మేర పెరిగాయి.
అంతర్జాతీయంగా డిమాండ్–సరఫరాల గ్యాప్
ప్రపంచవ్యాప్తంగా వెండిపై పారిశ్రామిక డిమాండ్ గణనీయంగా పెరుగుతుండగా, సరఫరాలో మాత్రం కొరత కొనసాగుతోంది. ఇది ధరలపై పెరుగుదల ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌర శక్తి రంగాల్లో వెండికి విస్తృత వినియోగం ఉండటం ఒక కీలక కారణం. MOFSL నివేదిక ప్రకారం, 2025 నాటికి వెండి ఉత్పత్తిలో 60 శాతం వరకు పారిశ్రామిక వినియోగానికినే ఉపయోగించబడే అవకాశముంది.

సురక్షిత పెట్టుబడి మార్గంగా వెండి
అంతర్జాతీయంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా (America)సుంక విధానాల్లో స్పష్టత లేకపోవడం వంటివి మదుపరులను బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి. వీటికి పెట్టుబడిగా వెండి ఆదరణ పొందుతున్నది.
కొనుగోలు సలహా – సమయం ఇదేనా?
నివేదిక ప్రకారం, ₹1,04,000–₹1,08,000 మధ్యలో వెండి ధర ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని సూచించారు. దీర్ఘకాల పెట్టుబడిదారులకు 12–15 నెలల వ్యవధిలో ₹1.35 లక్షల నుంచి ₹1.5 లక్షల ధరల స్థాయికి చేరవచ్చని అంచనా ఉంది. అయితే, ఇది రూపాయి–డాలర్ మారకం విలువ ₹88.5 వద్ద ఉంటే సాధ్యమవుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు.
వరుసగా ఐదో సంవత్సరం సరఫరాలో కొరత
వెండి సరఫరాలో గ్యాప్ ఇదేలా కొనసాగితే, ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలు తమ నిల్వల కోసం భారీగా వెండి కొనుగోలు చేస్తున్నాయి. పెట్టుబడి డిమాండ్ కూడా బలంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆభరణాల కోసం వెండి డిమాండ్ 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, పారిశ్రామిక మరియు పెట్టుబడి డిమాండ్ మాత్రం ధరలను నిలబెట్టేలా ప్రభావం చూపనున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Read also: