సంక్రాంతి పండుగ సమయం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు గత 15 రోజుల వ్యవధిలో లీటర్‌కు సుమారు రూ.5 వరకు పెరిగాయి. దసరా పండుగ సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం వినియోగదారులు లీటర్‌కు దాదాపు రూ.10 ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ వేళ వంటకాల వినియోగం పెరగడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Read also: AP: ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

Increased oil prices
సంక్రాంతి వేళ వినియోగదారులకు అదనపు భారం
సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో కొందరు వ్యాపారులు కావాలనే ధరలను పెంచుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి దేశీయంగా ఉత్పత్తి అయ్యే వంట నూనెల ధరల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దగా మార్పు కనిపించలేదు. రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గితే ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: