దేశీయ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో(Reliance Jio), తక్కువ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.91తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ను జియోఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు మొత్తం 3 GB డేటా లభిస్తుంది. ఇందులో రోజుకు 100 MB చొప్పున 2.8 GB డేటా, అదనంగా 200 MB బోనస్ డేటాను జియో అందిస్తోంది. అలాగే 28 రోజుల కాలవ్యవధిలో 50 SMSలు వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా వినియోగదారులు 64 kbps వేగంతో ఇంటర్నెట్ సేవల (Internet services)ను కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కాలింగ్, డేటా అవసరాలున్న వినియోగదారులకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం జియో అత్యంత తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్ రూ.189గా ఉంది. ఈ ప్లాన్‌కు కూడా 28 రోజుల వ్యాలిడిటీ ఉండటంతో బడ్జెట్ రీచార్జ్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా మారనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: