RBI new guidelines : ఆర్బీఐ తాజాగా ప్రకటించిన కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల బంగారం, వెండి (RBI new guidelines) ఆధారంగా రుణం పొందడం మరింత సులభం కానుంది.
ఇప్పటి వరకు గోల్డ్ లోన్స్ ఎక్కువగా ఆభరణాల దుకాణాలకు మాత్రమే లభ్యమయ్యేవి. కానీ ఇకపై ఈ పరిధి విస్తరించబడింది. బంగారం లేదా వెండిని ముడిసరుకుగా వినియోగించే తయారీ సంస్థలు, పరిశ్రమల యూనిట్లు కూడా ఈ రుణాలకు అర్హులు కానున్నారు. అంటే ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ సెంటర్లు కూడా గోల్డ్-సిల్వర్ రుణాన్ని వ్యాపార అవసరాలకు వినియోగించుకోవచ్చు.
మరొక పెద్ద మార్పు ఏమిటంటే, ఇంతవరకు ఈ రుణాలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. ఇకపై టియర్-3, టియర్-4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఈ రుణాలను మంజూరు చేయగలవు. దీని వల్ల చిన్న పట్టణాలు, MSMEs, స్థానిక వ్యాపారులకు కూడా సులభంగా ఈ సౌకర్యం లభిస్తుంది.
ఫ్లోటింగ్ రేట్ రుణాల విషయంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నియమాల ప్రకారం, మూడు సంవత్సరాలు పూర్తికాకముందే వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే EMI పద్ధతిలో తీసుకున్న పర్సనల్ లోన్స్‌లో ఫిక్స్‌డ్ రేట్ ఆప్షన్ ఇవ్వాలా వద్దా అన్నది ఇప్పుడు బ్యాంకులే నిర్ణయిస్తాయి.
గోల్డ్ మెటల్ లోన్ (GML) రీపేమెంట్ గడువు 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచబడింది. దీంతో జువెలరీ వ్యాపారులకు రుణం తిరిగి చెల్లించడానికి అదనపు సమయం లభిస్తుంది.
అదే విధంగా, రుణాల డేటా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నెలకు ఒకసారి కాకుండా వారానికి ఒకసారి సమర్పించాలి. దీని వల్ల వినియోగదారుల క్రెడిట్ రికార్డులు వేగంగా అప్‌డేట్ అవుతాయి.
ఈ మార్పులు చిన్న వ్యాపారులు, MSMEs, జువెలర్స్ అందరికీ ఊరటనివ్వనున్నాయి.
Read also :