రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ హితాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ స్కీమ్ అమలులోకి రాగానే, బ్యాంకులు లేదా NBFCల సేవల్లో లోపాల వల్ల వినియోగదారులకు కలిగే ఆర్థిక నష్టాలకు చెల్లించే గరిష్ఠ పరిహారాన్ని ₹20 లక్షల నుంచి ₹30 లక్షలకు పెంచనుంది.
Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే

కేవలం ఆర్థిక నష్టాలకే కాకుండా, కస్టమర్లు ఎదుర్కొనే మానసిక వేదన, అనవసరంగా సమయం వృథా అయిన సందర్భాలకు కూడా RBI ప్రత్యేక పరిహారాన్ని పెంచింది. ఇప్పటివరకు ₹1 లక్షగా ఉన్న ఈ మొత్తం ఇకపై ₹3 లక్షల వరకు అందించవచ్చని వెల్లడించింది.
జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, అలాగే NBFCలపై ఈ నియమాలు వర్తిస్తాయి. కస్టమర్లు తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు RBI ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకింగ్ సేవల్లో ఎదురయ్యే సమస్యలను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేస్తే, అంబుడ్స్‌మన్ వ్యవస్థ ద్వారా త్వరిత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: