కొత్త వస్తు, సేవల పన్ను జీఎస్టీ (GST)విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని బుధవారం ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం (P Chidambaram) తాజాగా స్పందించారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని స్వాగతించారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం (P Chidambaram) విమర్శలు గుప్పించారు. ఇంతకాలం తర్వాత ప్రభుత్వం హఠాత్తుగా ఈ మార్పులు చేయడానికి గల కారణాలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మందగించిన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న కుటుంబ అప్పులు, పడిపోతున్న పొదుపు, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్‌ల ఒత్తిడి.. జీఎస్టీ రేట్ల తగ్గింపుకు వీటన్నింటిలో ఏదో ఒక కారణమా..? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. అయితే, తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.
చిదంబరం బయోడేటా ఎవరు?
పళనియప్పన్ చిదంబరం (జననం 16 సెప్టెంబర్ 1945), పి. చిదంబరం అని సుపరిచితుడు, ఒక భారతీయ రాజకీయవేత్త మరియు న్యాయవాది, ప్రస్తుతం రాజ్యసభ పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన 2017 నుండి 2018 వరకు హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
చిదంబరం ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు?
పి చిదంబరం తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టి రెండవ అత్యధిక కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును కలిగి ఉన్నారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో 1996లో ఆయన తన మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు, ఆ తర్వాత 1997లో మరొక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
భారతదేశంలో అత్యధిక బడ్జెట్ కలిగిన రాష్ట్రం ఏది?
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరప్రదేశ్ అత్యధిక రాష్ట్ర బడ్జెట్ ₹8.08 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత కర్ణాటక, గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: