పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG Movie) పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మూవీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా దశలవారీగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్, ‘సువ్వి సువ్వి’ పాటలకు ప్రేక్షకుల నుండి పవర్‌ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటలతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్టైల్, యాక్షన్ షాట్స్ చూపిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచేశాయి.
ట్రైలర్ విడుదల అయ్యే అవకాశం
సినిమా ట్రైలర్ విషయంలో కూడా సుజీత్ (Sujeeth) జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగినట్టుగా ఉండేలా కట్ చేయాలని డైరెక్టర్ ఫోకస్ పెంచారట. సెప్టెంబర్ 18న ట్రైలర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్‌తో సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు.
ఇక తాజాగా ఈ మూవీ నుండి ‘గన్స్ అండ్ ఫైర్’ (Guns And Roses) అంటూ సాగే కొత్త సాంగ్ విడుదల చేశారు. ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఉత్సాహంతో నింపేలా మాస్ బీట్‌తో తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ యాక్షన్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి తగ్గట్టుగా ఈ సాంగ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు ఈ పాటను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, రీల్స్‌లో ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: