ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చింది. ఇటీవల ముగిసిన ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌కు కొనసాగింపుగా, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ 2025’ (‘Big Festive Dhamaka Sale 2025’) ను ప్రకటించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సేల్ అక్టోబర్ 3 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమవుతుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Stock Market: భారత్ మార్కెట్ బలహీనత – సెన్సెక్స్ 229 పాయింట్లు డౌన్
ఈ సేల్ ఈ రోజు (అక్టోబర్ 3) అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.అక్టోబర్ 8 వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో, బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అందుబాటులో ఉంచిన దాదాపు అన్ని ఆఫర్లను మళ్లీ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ముఖ్యంగా ఆ సేల్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయిన వినియోగదారులకు ఇది మరో సువర్ణావకాశం అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల వరకు అన్నింటిపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి.ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లు చేసేవారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.

గరిష్టంగా ₹1,500 వరకు ఈ ఆఫర్‌ను పొందవచ్చు
గరిష్టంగా ₹1,500 వరకు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. దీంతో పాటు, పాత వస్తువులను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు బోనస్, ఖరీదైన వస్తువులపై 3 నుంచి 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ (Smartphone) లపై భారీ ఆఫర్లు ప్రకటించారు. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను బ్యాంకు ఆఫర్లతో కలిపి ₹60,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.
వీటితో పాటు సాంసంగ్ గెలాక్సీ S24 (స్నాప్‌డ్రాగన్ వెర్షన్), మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ వంటి మోడళ్లపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఇక టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 40 నుంచి 70 శాతం వరకు, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉంటాయి.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ సేల్ దోహదపడుతుందని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఆపిల్, సాంసంగ్, సోనీ, ఎల్‌జీ వంటి అనేక ప్రముఖ బ్రాండ్లు ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: