हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

Offer friendship:స్నేహానికి చెయ్యిచాచు

Hema
Offer friendship:స్నేహానికి చెయ్యిచాచు

అటు అయ్యవారిపేట, ఇటు టేకులపేట రెండు పేటలు కలిసే ఉంటాయి. కానీ ఆ రెండు పేటల
మధ్యలో ఓ చిన్నచెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున టేకులపేట వైపు ఓ టేకు చెట్టు, అయ్యవారిపేటవైపు ఆముదం చెట్టు ఉన్నాయి.

ఆ చెట్టుమీద కాకులు గూడులు కట్టుకొని
జీవిస్తున్నాయి.అయ్యవారిపేటలోని కుక్కలు, టేకులపేటని కుక్కలకు పడవు. ఆ కుక్కలు(dogs) ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వడం చేస్తుంటాయి. కరుసుకోవడం, అరుసుకోవడం వాటికి ప్రతిరోజు (every day) అలవాటు అయిపోయింది.

Offer friendship

ఓ రోజు కాకి కుక్కతోమాట్లాడసాగింది. ‘మిత్రమా ఏంటి నీకు ఒళ్లంతా
గాయాలు? అవును రాత్రి మీ పేటలో ఏంటి అరుపులు!’ అని అడిగింది.అదేరాత్రి అయ్యవారిపేట కుక్కలు మా టేకులపేటకు వచ్చాయి.

అందుకే మేం అరిచాం, కరిచాం, ఆ అరవడం కరవడంలో నాకు కూడా గాయాలు అయ్యాయి’ అని కుక్క చెప్పింది.
‘అయ్యా ఎందుకు అరవడం కరవడం మిత్రమా!?’ అని మళ్లీ అడిగింది కుక్కను కాకి. మరి కరవమా, అరవమా? మేం మొన్న అయ్యవారిపేట వెళితే మమ్మల్ని అక్కడ కుక్కలన్నీ కలిసి, మమ్మల్ని కరిచాయి, తరమాయి, నిన్నరాత్రి మా టేకులపేట ఆ అయ్యవారిపేట కుక్కలు
వచ్చాయి. అందుకు బదులుగా మేం అరిచాం, కరిచాం, తరిమాము అంతే మిత్రమా ఏమీ లేదు’
అని కుక్క చెప్పింది.

Offer friendship

అయ్యో అలా కయ్యానికి కాలు దువ్వుతే ఎలా?’ అని కాకి కావుకావు’ అంది. అంతే ఎక్కడో ఉన్న కాకులన్నీ కాసేపట్లోనే టేకు చెట్టు దగ్గరకి చేరాయి. ఏమైంది ఏమైంది? నీకు ఏమైనా ఆపద వచ్చిందా?’ అని కాకులన్నీ ముక్తకంఠంతో ఆ కాకినిఅడిగాయి.
‘అయ్యో నాకేమీ కాలేదు.

ఈ కుక్క మిత్రుని తో మాట్లాడుతున్నాను. ఈ కుక్కలు మనలా కలిసిమెలసి ఉండటం లేదు. ఈ పేటకుక్కలని, ఆ పేట కుక్కలని కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అనవసరంగా అనర్ధాలు కొనితెచ్చుకుంటున్నాయి గొడవలు పెట్టుకుంటున్నాయి. దెబ్బలు తగిలించుకుంటున్నాయి. అనే నా బాధ ఆ బాధలోనే అలవాటులో పొరపాటుగా
‘కావు కావు’ అని అరిచాను’ అంది ఆ కాకి మిగతా కాకులతో. అదేంటి నువ్వు అలా పిలిచావో లేదో ఇలా మ కాకులన్నీ నీ దగ్గర వచ్చి,వాలా ఏంటి?’

అని ఆరా తీసింది కుక్క. మేం ఎప్పుడూ గొడవలు పెట్టుకోము, మాలో ఎవరికైనా, ఎప్పుడైనా, ఏదైనా ఆపద వస్తే అందరం కలిసి, మెలసి ఆపద నుండి బయటపడతాం. అవును మిత్రమా కలిసి ఉంటే కలదు సుఖం! కయ్యాటలు పెట్టుకుంటే కలదు కష్టం’ అంది. అవును నువ్వు చెప్పింది నిజమే మేం చేసేది తప్పే, ఇకనుండి మీ కాకుల్లాగే మేం కుక్కలం చక్కగా కలసిమెలసి మసులుతాము, కయ్యానికి కాలు చాపం, స్నేహానికి చేయి చాస్తం, సరేనా’ అంది తోక ఊపుతూ కుక్క. చాలాచాలా సంతోషం.

Offer friendship

ఇకనుండి ఈ పేటలో కుక్కల అరుపులు ఉండకూడదు. కలకాలం కలిసి, మెలసి హాయిగా ఆనందంగా ఉల్లాసంగ ఉత్తేజంగా ఉండండి’ అని అక్కడి నుండి కాకి కావుకావు’ అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది.
ఆ రోజు నుండి అయ్యవారిపేటలో కానీ టేకులపేటలో కానీ కుక్కల అరుపులు లేనేలేవు. ఆ పేట ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crow-steals-doll-story/kids-stories/524322/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870