యూపీఐ (UPI) లావాదేవీలు దేశంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. జనవరి నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.28.33 లక్షల కోట్లకు చేరుకోగా, లావాదేవీల సంఖ్య 21.70 బిలియన్లుగా నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.
Read Also: Silver Rate Today Hyderabad: భారీగా పతనమైన వెండి ధరలు

డిసెంబర్ నెలలో (NPCI) నమోదైన రూ.27.97 లక్షల కోట్లతో పోలిస్తే ఇది సుమారు 21 శాతం వృద్ధి కావడం గమనార్హం. జనవరి నెలలో రోజుకు సగటున 700 మిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. రోజువారీ లావాదేవీల విలువ సగటున రూ.91,033 కోట్లకు చేరింది.
డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం, స్మార్ట్‌ఫోన్ వినియోగం విస్తరణ, చిన్న వ్యాపారాల వరకు యూపీఐ సేవలు చేరడం వంటి అంశాలు ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో యూపీఐ లావాదేవీలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: