హీరో మోటోకార్ప్(New Bike) తన ప్రజాదరణ పొందిన 125 సీసీ బైక్ ఎక్స్‌ట్రీమ్ 125R కి కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌ను కంపెనీ రూ. 1.04 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా, కమ్యూటర్ బైక్‌ల విభాగంలో అరుదుగా కనిపించే డ్యూయల్-ఛానల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్‌తో ఈ బైక్ ప్రత్యేకత సంతరించుకుంది. ఎలాంటి ప్రత్యేక లాంచ్ ఈవెంట్ లేకుండా నేరుగా షోరూమ్‌లలో అందుబాటులోకి వచ్చింది.
Read also: భారత్ కు హాని చేయడమే పాక్ లక్ష్యం: మోహన్ భగవత్

కొత్త ఫీచర్లు – రైడ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ ఆకర్షణ
ఈ వేరియంట్‌లో హీరో తన గ్లామర్ X సిరీస్‌లోని కొన్ని టెక్నాలజీలను తీసుకుంది. ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటిల్, క్రూయిజ్ కంట్రోల్, అలాగే(New Bike)మూడు రైడింగ్ మోడ్‌లు ఎకో, రోడ్, పవర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడర్‌కి సమాచారం చూపించేందుకు 4.2 అంగుళాల కలర్(LCD) డిస్‌ప్లేని జోడించారు. భద్రత పరంగా రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి.
హ్యాండిల్‌బార్‌పై కుడి వైపు క్రూయిజ్ కంట్రోల్ కోసం ప్రత్యేక బటన్, ఎడమ వైపున రైడింగ్ మోడ్‌లు మార్చుకోవడానికి స్విచ్‌లు ఉన్నాయి. కొత్తగా మూడు డ్యూయల్-టోన్ రంగులు ఎరుపు, బూడిద, ఆకుపచ్చ అందుబాటులోకి వచ్చాయి. వీటికి నలుపు కలర్ కాంబినేషన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
ఇంజిన్ మరియు పనితీరు
ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇదే పూర్వ మోడల్‌లో ఉన్న 124.7cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ను కొనసాగించారు. ఇది 8,250 rpm వద్ద 11.4 bhp పవర్, 6,000 rpm వద్ద 10.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్తో జత చేయబడింది.
ప్రస్తుతం ఎక్స్‌ట్రీమ్ 125R నాలుగు వేరియంట్లలో లభిస్తోంది
బేస్ IBS వేరియంట్: రూ. 89,000, సింగిల్ సీట్ ABS: రూ. 92,500, కొత్త డ్యూయల్-ఛానల్ ABS వేరియంట్: రూ. 1.04 లక్షలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: