హైదరాబాద్: జపాన్ కారాటే అసోసియేషన్ ఇండియా అద్వర్యం లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక ఐదు రోజులపాటు నిర్వహించనున్న మొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్-2025 పోటీలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను , జె.కె.ఎ. హెడ్క్వార్టర్స్ ఇన్స్ట్రక్టర్ 8వ డాన్ ఇమురా షిహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేకేఏ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్, 7వ డాన్ ఆనంద రత్న సిహాన్ మాట్లాడుతూ.. 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీలలో మొదటి మూడు రోజులు జాతీయ స్థాయి క్రీడాకారులకు రెండు రోజులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు.

ఈ పోటీలలో ఎనిమిది సంవత్సరాల నుండి 72 సంవత్సరాల వయసుగల కరాటే క్రీడాకారులు పాల్గొంటున్నారని , న్యూజిలాండ్ ,అమెరికా, శ్రీలంక, రష్యా, లతోపాటు కజకిస్తాన్ కు చెందిన పలువురు కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రచరింప పొందిన మార్షల్ ఆర్ట్స్ లో కరాతే ఒకటిని, కరాటే సాధన ఫిట్నెస్, బలం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, వంటి ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు. కరాటే సమర్థవంతమైన స్వీయ రక్షణ టెక్నిక్ కావడం చాలా మంది అమ్మాయిలు కూడా ఆకర్షిస్తుందని తెలిపారు. తమ అసోసియేషన్ లోని పలువురు అభ్యాసకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న పథకాలు సాధించారని తెలిపారు.

ఈ పోటీలలో లో 25 రాష్ట్రాలకు చెందిన యువత పాల్గొనడం కరాటే కు పెరుగుతున్న ప్రజాదారులకు నిదర్శనమని తెలిపారు. జీకేఏ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనందుకు ప్రపంచం నలుమూలల నుండి 1200 మంది హాజరు కాగా వారిలో 125 మంది విదేశీయులు, 400 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జెకెఎ హెడ్క్వార్టర్స్, 7 వ డాన్ లు తానియామా షిహాన్, హిరయామా షిహాన్,ఆనంద్ రత్న షిహాన్, జెకెఎ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్, 4వ డాన్ హీరోస్ సెన్సి పాల్గొన్నారు.