గతంలో యువత వారానికి 72 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు అదే విషయాన్ని రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మరింత స్పష్టం చేస్తూ, తాను చెప్పింది దేశ పురోగతికి అవసరమైనదే అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.
Read Also: Delhi blast: ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన కారు యజమాని

చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు
‘చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు. కానీ దీనికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలి. చైనాలో వారానికి 72 గంటల (9AM-9PM-6 రోజులు) రూల్ ఉంది. దేశ పని సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ’ అని (Narayana Murthy) చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: