2025 సంవత్సరం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగులకు కష్టకాలం అనే చెప్పవచ్చు. ఏకంగా ఈ ఏడాదిలో ఇది రెండోసారి పెద్ద స్థాయిలో లేఅఫ్‌కి పాల్పడింది కంపెనీ. మే నెలలోనే దాదాపు 6,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ వెంటనే జూన్‌లో మరో 300 మందికిపైగా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు జూలై వచ్చేసరికి మళ్లీ పెద్ద ఎత్తున సుమారు 9,000 మందిని బయటకు పంపునట్లు సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగులలో దాదాపు 4 శాతం మందిని ఈసారి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.
సేల్స్, మార్కెటింగ్, గేమింగ్ రంగాలపై భారీ ప్రభావం
మైక్రోసాఫ్ట్ (Microsoft)తాజా 4% ఉద్యోగుల తొలగింపులు ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్, గేమింగ్ (ఎక్స్‌బాక్స్, కింగ్, జెని మ్యాక్స్, టర్న్ 10) విభాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎక్స్‌బాక్స్ గ్రూపులో ముఖ్యంగా భారీ కోతలు జరిగాయి. ఉదాహరణకు టర్న్ 10 స్టూడియోలో సగానికి పైగా ఉద్యోగులు కోల్పోయారు, అలాగే కింగ్ డివిజన్‌లో 10% ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ప్రముఖ గేమ్ ప్రాజెక్టులు అయిన పెరఫెక్ట్ డార్క్, ఎవర్ విల్డ్ వంటి గేమ్స్ రద్దయ్యాయి, The Initiative వంటి స్టూడియోలు మూసివేయబడ్డాయి. జెని మ్యాక్స్, రావెన్ సాఫ్ట్ వేర్, స్లెడ్జ్‌హ్యామర్ గేమ్స్, రేర్ వంటి అనేక స్టూడియోలు కూడా ఈ లేఅవ్‌ల వల్ల ప్రభావితమయ్యాయి.

9,000 ఉద్యోగులు రోడ్డున..
ఈ లేఅవ్‌లలో వాషింగ్టన్ రాష్ట్రంలో మాత్రమే 830 ఉద్యోగాలు తొలగించబడ్డాయని అధికారిక సమాచారం ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) తొలగించిన ఉద్యోగాలలో సుమారు 9%కి సమానం. ఈ చర్యలు సంస్థ వ్యయ నియంత్రణ, మేనేజ్మెంట్ సరళీకరణ, మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా మార్పులు చేయడం వంటి వ్యూహాత్మక అవసరాల నేపథ్యంలో తీసుకున్నాయి.
AI దిశగా నూతన నిర్మాణం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడులు దాదాపు $80 బిలియన్ పెట్టుబడులు వేస్తున్న మైక్రోసాఫ్ట్, ఈ మారుతున్న పరిస్థితులు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మరింత సజావుగా మలచే పనిలో ఉంది. వినియోగదారుల అవసరాలను వేగంగా తీర్చడమే కాక, నిర్వహణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ స్థాయిలను సీరియస్‌గా కుదించుతోంది. ఈ ప్రణాళికలలో భాగంగానే, తాజా ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి.

మార్కెట్‌పై ప్రభావం & భవిష్యత్ ప్రణాళికలు
గత త్రైమాసిక ఆర్థిక నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ $70 బిలియన్ ఆదాయాన్ని మరియు $26 బిలియన్ నికర లాభాన్ని నమోదుచేసింది. జూన్ 26న కంపెనీ షేర్ ధర అత్యధిక స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ట్రేడింగ్‌లో కొత్తగా 0.6% శాతం తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఆదాయం మరియు లాభాల్లో స్థిరతను చూపించినా, సంస్థ ముందస్తుగా భవిష్యత్ మౌలిక మార్పుల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో షేర్ ప్రైస్‌లను కొద్దిగా ప్రభావితం చేసింది.
Read Also: Gold Rates: బులియన్ మార్కెట్ కళకళ