దేశీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థ మారుతి సుజు(Maruti Suzuki)కి, కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ రేట్ల నేపథ్యంలో తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో చిన్న కార్ల నుంచి ప్రీమియం మోడల్స్ వరకు అనేక వేరియంట్లలో వినియోగదారులకు లాభం చేకూరనుంది. కార్ల ధరల్లో ఈ తగ్గింపు వాహనాల విక్రయాలను పెంచడమే కాకుండా, మార్కెట్లో పోటీని మరింత ఉధృతం చేసే అవకాశముంది.
మారుతి సుజుకి ప్రకటించిన వివరాల ప్రకారం.. ఎస్-ప్రెసోపై రూ.1,29,600 తగ్గింపు లభించనుంది. అలాగే ఆల్టో K10పై రూ.1,07,600 వరకు ధర తగ్గింది. ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100 నుంచి రూ.1,12,700 వరకు తగ్గింపు ప్రకటించారు. అదే విధంగా డిజైర్‌పై రూ.87,700, 5-R మోడల్‌పై రూ.79,600 తగ్గింపులు ఉన్నాయి. మధ్య తరహా కార్లతో పాటు జిమ్నీపై రూ.51,900, ఎర్టిగా మోడల్‌పై రూ.46,400 వరకు తగ్గింపులు అమల్లోకి వచ్చాయి.
ఈ ధర తగ్గింపుతో వినియోగదారులు మరింత లాభం పొందే అవకాశం ఉంది. ప్రత్యేకించి మధ్య తరగతి కుటుంబాలు ఎప్పటినుంచో కలలుగన్న మోడళ్లను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. నూతన జీఎస్టీ రేట్లు ఆటోమొబైల్ రంగానికి ఊతమివ్వడంతోపాటు, రాబోయే పండుగ సీజన్‌లో కార్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మారుతి సుజుకి తీసుకున్న ఈ నిర్ణయం ఇతర ఆటోమొబైల్ కంపెనీలను కూడా ధరల సవరణ వైపు నెట్టవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.