हिन्दी | Epaper

Stock Market: మార్కెట్‌ ప్రారంభం: ఒడుదొడుకుల్లో సూచీలు

Shobha Rani
Stock Market: మార్కెట్‌ ప్రారంభం: ఒడుదొడుకుల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. తొలుత నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 96 పాయింట్ల లాభంతో 81,679 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 39 పాయింట్ల లాభంతో 24,893 వద్ద ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు & వస్తువుల ధరలు
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 76.81 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,402 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Stock Market: మార్కెట్‌ ప్రారంభం: ఒడుదొడుకుల్లో సూచీలు
Stock Market: మార్కెట్‌ ప్రారంభం: ఒడుదొడుకుల్లో సూచీలు

అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగింపు
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.91 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 0.84 శాతం, డోజోన్స్ 0.70 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.66 శాతం లాభంతో ట్రేడవుతుండగా.. హాంగ్‌సెంగ్‌ 1.30 శాతం, షాంఘై 0.32 శాతం నష్టంతో కదలాడుతోంది. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ మాత్రం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.1,483 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) నికరంగా రూ.8,207 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.మహిళా టెక్నాలజీ నిపుణులు తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచుకుని మార్కెట్‌లో మంచి భవిష్యత్తును నిర్మించగలరని సూచనలు వెలువడుతున్నాయి.

read Also: Stock market: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతలు: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870