గత వారం భారత స్టాక్ మార్కెట్ తీవ్ర క్షీణతను చూపింది. ఐదు రోజుల వ్యవధిలోనే పెట్టుబడిదారులు సుమారు రూ.16 లక్షల కోట్లను కోల్పోయారు. శుక్రవారం సెన్సెక్స్ 733.22 పాయింట్లు (0.90%) పడిపోయి 80,426.46 వద్ద ముగిసింది, నిఫ్టీ 50 236.15 పాయింట్లు (0.95%) తగ్గి 24,654.70 వద్ద నిలిచింది. ఈ భారీ నష్టాలు(Huge losses) పెట్టుబడిదారుల ఆందోళనను మరింత పెంచాయి.
Read Also: Asia Cup 2025: భారత్, పాక్ ఫైనల్..ఎక్కడ చూడాలంటే?
విదేశీ పెట్టుబడిదారులు శుక్రవారం రూ.16,057.38 కోట్ల విలువైన వాటాలను అమ్మగా, భారతీయ పెట్టుబడిదారులు కూడా రూ.11,464.79 కోట్ల వాటాలను విక్రయించారు. వీటన్నీ మార్కెట్ ఒత్తిడికి ప్రధాన కారణమయ్యాయి. ఇదే సమయంలో రూపాయి బలహీనపడడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది, డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 88కి బలహీనపడింది.

ఐటీ రంగంపై ఒత్తిడి
IT రంగం కూడా భారీ ఒత్తిడిలో ఉందీ. అమెరికా H-1B వీసా ఫీజులు(H-1B Visa Fee) పెరగనున్నట్లు నిర్ణయం తీసుకున్న కారణంగా టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల షేర్లు క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 8% తగ్గింది, టీసీఎస్ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐటీ స్టాక్‌ల ఆరు రోజుల క్షీణతలో మార్కెట్ క్యాప్‌లో రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టం నమోదైంది.
ఔషధ రంగం కూడా దెబ్బతిన్నది. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాల దిగుమతులపై 100% సుంకం విధించడంతో సన్ ఫార్మా, లుపిన్, సిప్లా వంటి కంపెనీల షేర్లు 10% వరకు పడిపోయాయి. సన్ ఫార్మా షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. రాబోయే వారం త్రైమాసిక ఫలితాలు, RBI సమావేశం, ఆటో రంగ అమ్మకాల డేటా వంటి ఈవెంట్స్ మార్కెట్‌ను కీలకంగా ప్రభావితం చేయగలవు.
గత వారం భారత స్టాక్ మార్కెట్ లో ఎన్ని పాయింట్లు పడిపోయాయి?
సెన్సెక్స్ సుమారు 2,587 పాయింట్లు, నిఫ్టీ 236.15 పాయింట్లు పడింది.
మార్కెట్ క్షీణతకు ప్రధాన కారణాలు ఏమిటి?
విదేశీ అమ్మకాలు, IT మరియు ఫార్మా స్టాక్‌ల ఒత్తిడి, రూపాయి విలువ తగ్గడం, బ్యాంకింగ్ ఒత్తిడి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: