పాకాల (తిరుపతి): తిరుపతి జిల్లా(Tirupati District) పాకాల మండలం(Pakala Mandal) మద్దినాయునిపల్లి(Maddinayunipalli) పెద్ద హరిజనవాడకు చెందిన గిరి తన భార్య హేమలత, ఇద్దరు కుమార్తెలు తనుశ్రీ, తేజశ్రీని బావిలో తోసి చంపేశాడు. ఆ తర్వాత గిరి సైతం గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మద్దినాయునిపల్లె పంచాయతీ పెద్ద హరిజనవాడ గ్రామంనకు చెందిన గిరి కుటుంబ కలహాలతో తన భార్య హేమలత, ఇద్దరు కుమార్తెలు తనుశ్రీ, తేజశ్రీని మద్దినాయన పల్లి నుంచి కొమ్మి రెడ్డిగారి పల్లి కు వెళ్లే రోడ్డు మార్గం నందు రోడ్డు పక్కన ఉన్న పూడు బావిలోకి తన భార్య కుమార్తెలను తోసేసి చంపేశాడు.

గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నం
అనంతరం తన అన్న బాబు అనే వ్యక్తికి ఫోన్ చేసి నా భార్య బిడ్డలను బావిలో
తోసి చంపాను అని చెప్పి నేను కూడా బావిలో దూకి చచ్చిపోతాను అని చెప్పాడు, బాబు వెంటనే విషయాన్ని తన గ్రామస్తులకు తెలియ పరిచాడు. గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోగా గిరి బావిలో ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు పైకి రా అని పిలవగా నేను రాను అని చెప్పి తన దగ్గర ఉన్న కత్తితో గొంతు కోసుకున్నాడు. వెంటనే గ్రామస్తులు బావిలోకి దూకి గిరిని వెలికి తీశారు. గ్రామస్తులు విషయాన్ని పాకాల పోలీస్ వారికి సమాచారం తెలియపరచగా వెంటనే పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికి గిరి అనే వ్యక్తి ప్రాణాలతో ఉండగా వెంటనే అతనిని పోలీసులు కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మృతదేహాలను వెలికి తీశారు .
హత్య అంటే ఏమిటి?
హత్య, క్రిమినల్ చట్టంలో, చట్టబద్ధంగా సమర్థించబడని లేదా క్షమించరాని వ్యక్తిని మరొకరు చంపడం , సాధారణంగా ముందస్తుగా ఆలోచించిన దురుద్దేశంతో నరహత్య నేరం నుండి వేరు చేయబడుతుంది.
హత్యకు కారణాలు ఏమిటి?
అభిరుచితో జరిగే నేరాలకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణ ఉద్దేశ్యాలలో అసూయ, ప్రతీకారం, భయం మరియు కోపం ఉన్నాయి. ఈ భావాలు స్పృహలో లేదా అపస్మారక స్థితిలో ఉండవచ్చు. హత్య అనేది ఆకస్మికంగా లేదా ముందస్తుగా నిర్ణయించబడిన చర్య కావచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Nominated Post: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభం