हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: US Open 2025 క్వార్టర్ ఫైనల్ కి చేరిన అల్కరాజ్, జకోవిచ్, సబలెంకా

Anusha
Latest News: US Open 2025 క్వార్టర్ ఫైనల్ కి చేరిన అల్కరాజ్, జకోవిచ్, సబలెంకా

అమెరికా న్యూయార్క్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ 2025 (US Open 2025) ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ప్రతి మ్యాచ్ సస్పెన్స్, ఉత్కంఠలతో నిండి ఉండగా, టాప్ సీడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జకోవిచ్, టేలర్ ఫ్రిట్జ్, అరీనా సబలెంకా, జెస్సీకా పెగులా లాంటి స్టార్‌లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టారు. వీరి ప్రదర్శనతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.స్పానిష్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆట మొదలైన క్షణం నుంచే ఆగ్రెసివ్ గేమ్ ప్రదర్శించి ప్రత్యర్థిని ఆడనివ్వలేదు. తన ఫోర్‌హ్యాండ్ షాట్స్, బేస్‌లైన్ గేమ్ ప్రేక్షకులను అలరించాయి. అతని సర్వీస్ రిటర్న్‌లు, చాకచక్యంగా ఆడిన వాలీలు అతడిని విజేతగా నిలిపాయి. ప్రస్తుతం అతను టైటిల్ ఫేవరేట్‌గా మారాడు.

వరుసగా మూడు సెట్లు నెగ్గిన

జర్మనీ స్టార్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ (Alexander Zverev) కు మాత్రం బిగ్ షాక్‌ తగిలింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-4, 6-7(7/9), 4-6, 4-6 తేడాతో 25వ సీడ్ ప్లేయర్ ఫెలిక్స్ అలియాసిమ్(కెనడా) చేతిలో ఓటమిపాలయ్యాడు.తొలి సెట్ గెలిచి శుభారంభం చేసిన జ్వెరెవ్ ఆ తర్వాత తడబడ్డాడు. అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం కల్పించాడు. దాంతో వరుసగా మూడు సెట్లు నెగ్గిన అలియాసిమ్.. జ్వెరెవ్‌పై సంచలన విజయాన్నందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అలియాసిమ్ 10 ఏస్‌లతో పాటు 50 విన్నర్లు కొట్టాడు.మరో మ్యాచ్‌లో 7వ సీడ్, సెర్బియా దిగ్గజం నోవాక్ జకోవిచ్ 6-3, 6-3, 6-2 తేడాతో జర్మనీకి చెందిన క్వాలిఫైయర్ జెన్-లెనార్డ్ స్ట్రఫ్‌పై సునాయస విజయాన్నందుకున్నాడు. గంట 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. సర్వీస్‌లను సులభంగా గెలుచుకుంటూ ముందుకు సాగాడు.

Latest News
Latest News

అనవసరం తప్పిదాలు

జకోవిచ్ ముఖ్యంగా తన రిటర్న్స్ గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. స్ట్రఫ్ సర్వీస్‌ను చాలాసార్లు బ్రేక్ చేసిన జకోవిచ్.. స్ట్రఫ్‌‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఇక స్ట్రఫ్ పవర్‌ఫుల్ ఫోర్‌హ్యాండ్, సర్వీస్‌తో జకోవిచ్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా.. జకోవిచ్ తన డిఫెన్స్, వ్యూహాత్మక షాట్‌లతో వాటిని తిప్పికొట్టాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ (Djokovic) 6 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టగా.. 2 డబుల్ ఫాల్ట్స్, 15 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు స్ట్రఫ్ 10 ఏస్‌లతో పాటు 28 విన్నర్లు కొట్టాడు. 4 డబుల్ ఫాల్ట్స్, 35 అనవసరం తప్పిదాలు చేశాడు.స్పెయిన్ స్టార్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ 7-6 (3), 6-3, 6-4 తేడాతో ఫ్రెంచ్ ప్లేయర్ ఆర్థర్ రిండర్‌క్నెచ్‌పై విజయం సాధించాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. తొలి సెట్‌లో కొద్దిగా పోటీ ఎదురైనప్పటికీ టై-బ్రేక్‌లో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. పవర్‌ఫుల్ ఫోర్ హ్యాండ్ షాట్స్‌తో పాటు వేగవంతమైన కదలికలతో ప్రత్యర్థిని నిలవరించాడు.

బుక్సాపై విజయం

చాలా సునాయసంగా రెండో, మూడో సెట్‌లను గెలుచుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 7 ఏస్‌లు, 41 విన్నర్లు కొట్టాడు. 4 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 24 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్‌లో టెలర్ ఫ్రిట్జ్ (4వ సీడ్) 6-4, 6-3, 6-3 తేడాతో టామ్స్ మాచక్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా 6-1, 6-4 తేడాతో క్రిస్టినా బుక్సాపై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ జెస్సికా పెగులా 6-1, 6-2 తేడాతో అన్‌ లీపై గెలిచి క్వార్టర్‌ఫైనల్స్‌‌కు దూసుకెళ్లింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-rohit-sharma-i-really-like-heroine-kareena-kapoor/sports/539311/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870