हिन्दी | Epaper

KTR : స్వాతంత్య్ర దినోత్సవం.. జాతీయ జెండాను ఎగరవేసిన కేటీఆర్

Sai Kiran
KTR : స్వాతంత్య్ర దినోత్సవం.. జాతీయ జెండాను ఎగరవేసిన కేటీఆర్

79వ స్వాతంత్ర్య వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. విద్యాసంస్థలు, ఐటీకార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలలో త్రీవర్ణపతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా జాతీయ జెండాను ఎగరవేసారు. తెలంగాన భవన్లో ఈ ఉదయం కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు జెండాను ఎగరవేసారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలైనవిధానంలో పాలన చేయడంలో విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ఢిల్లీ పాలన పెత్తనం నడుస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 51వ సారి ఢిల్లీకి వెళ్లారని, ప్రతిచిన్న పనికి ఢిల్లీకి పోయే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గోల్కొండ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలతో ప్రసంగించారని కేటీఆర్ విమర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870