हिन्दी | Epaper

Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి

Anusha
Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి

కర్ణాటక (Karnataka) సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) కు చెందిన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను ఎంపిక చేయడంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. దీనికి వ్యాపార పరమైన కారణాలు ఉన్నాయని వెల్లడించారు. స్థానిక నటీమణులు ఇప్పటికే ఇతర బ్రాండ్లతో అనుబంధమై ఉన్నారని చెప్పారు. దీపికా పదుకొనే పేరును పరిశీలించినప్పటికీ, ఆమె డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా తీసుకోలేదన్నారు.

Read Also: Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

మైసూరు శాండిల్ కోసం తమన్నాని ఎందుకు ఎంపిక చేశారో చెప్పిన మంత్రి

ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగపడతారు

మైసూర్ శాండల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటక (Karnataka) కే పరిమితం కాలేదు. తెలంగాణలో 18%, ఉత్తర భారతదేశంలో 8%, అంతర్జాతీయంగా 1% మార్కెట్ ఉంది. 2030 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం” అని మంత్రి తెలిపారు. తమన్నాకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్, కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్ కు, బాగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870