పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్. ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్, మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.
జెప్టో యాడ్‌లో ఎన్టీఆర్
తాజాగా ఎన్టీఆర్ జెప్టో అనే నిత్యావసర సరుకుల డెలివరీ సంస్థ కోసం ఓ కొత్త యాడ్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనలో ఎన్టీఆర్ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.యాడ్‌లో “ఇది జెప్టో సూపర్ సేవర్ అండీ, ధరలు చాలా తక్కువ ఒకసారి చూసేయండి” అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా మారింది. మామూలుగా ఉండకుండా, యాడ్‌లో ఆయన ఫ్రిజ్‌లో కూర్చుని, వాషింగ్ మెషీన్‌లో ఉన్నట్లు ఫన్ ఎలిమెంట్ జోడించడంతో ఈ యాడ్ మరింత వినోదాత్మకంగా మారింది.
ఎన్టీఆర్ బ్రాండ్ వాల్యూతో మరింత క్రేజ్
ఎన్టీఆర్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్‌తో పాటు ఆయన బిజినెస్ సెన్స్ కూడా టాప్ లెవల్‌లో ఉంది. గతంలో కూడా ఎన్టీఆర్ పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నటించిన ఏదో ఒక యాడ్ టీవీ ఛానల్‌లో తరచూ ప్రసారమవుతూనే ఉంటుంది.ఈ కొత్త జెప్టో యాడ్ కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన తెచ్చుకుంటోంది. ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎన్టీఆర్ యాడ్ క్లిప్స్‌ను షేర్ చేస్తూ హాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్
వాణిజ్య ప్రకటనలతో పాటు ఎన్టీఆర్ ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.ఇకపోతే, ‘దేవర 2’ సినిమాను కూడా ఎన్టీఆర్ పూర్తి చేయనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
ఫ్యాన్స్ ఆనందం
ఎన్టీఆర్ యాడ్ కామెడీ టచ్, ఫ్రెష్ ప్రెజెంటేషన్ వల్ల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ యాడ్‌కు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, జెప్టో కంపెనీ మరిన్ని ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్‌తో కలసి పనిచేయనుందని టాక్.ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ కొత్త యాడ్‌ను వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ కొత్త యాడ్ జనాలకు తెగ నచ్చేసింది. తెగ వైరల్ చేసేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరగా ‘దేవర’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది.బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్ల కలెక్షన్స్ వరకూ తీసుకొచ్చారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ మూవీలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు తారక్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు.