ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో(Jio) తన వినియోగదారుల కోసం మరో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. గూగుల్‌తో కలిసి అందిస్తున్న జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను ఇప్పుడు అన్ని వయసుల వారికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఈ ఆఫర్‌ను కేవలం 18 నుంచి 25 ఏళ్ల యువతకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు అయితే 25 ఏళ్లు పైబడిన వినియోగదారులూ దీనిని ఉపయోగించుకోగలరు.
ఈ ప్రత్యేక ఆఫర్ కింద యూజర్లకు రూ.35,100 విలువైన జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలంటే జియో యూజర్ వద్ద అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే, నెలకు కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన రీఛార్జ్ చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Read Also: Accident: నల్గొండ జిల్లాలో భయానక రోడ్డుప్రమాదం

ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లకు జెమినీ 2.5 ప్రో మోడల్, 2జీబీ క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ప్రీమియం ఏఐ ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా జెమినీ కోడ్ అసిస్టెంట్, నోట్‌బుక్ ఎల్ఎం, జీమెయిల్, గూగుల్ డాక్స్‌లో జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
మైజియో యాప్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి
ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు తమ MyJio యాప్‌ను ఓపెన్ చేసి, అందులో కనిపించే ‘Claim Now’ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. ఆప్షన్ యాక్టివ్‌గా ఉంటే వెంటనే ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ కొందరు యూజర్లకు మాత్రమే లభిస్తున్నప్పటికీ, కంపెనీ దశలవారీగా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. కొందరికి ప్రస్తుతం ‘Register Interest’ ఆప్షన్ మాత్రమే కనిపిస్తోంది.
టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉన్న జియో, ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు అత్యాధునిక ఏఐ సదుపాయాలు అందిస్తోంది. దీంతో, ఇప్పుడు అన్ని వయసుల జియో యూజర్లు గూగుల్ జెమినీ ఏఐ ప్రో సేవలను ఉచితంగా పొందే అవకాశం పొందుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: