దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys)ఉద్యోగులకు చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. సీనియర్ ఉద్యోగులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే వారికి నగదు రూపంలో రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అనుభవజ్ఞుల నియామకాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. బెంగళూరులో (In Bangalore) ప్రధాన కార్యాలయం కలిగిన ఈ ఐటీ దిగ్గజం, దేశీయ నియామకాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది.ప్రస్తుతం క్యాంపస్ నియామకాల కన్నా అనుభవజ్ఞుల నియామకాలను ఐటీ రంగం ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని గమనించిన ఇన్ఫోసిస్, ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగుల సహకారాన్ని గుర్తించి, వారిని బహుమతులతో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇది ఉద్యోగుల్లో భాగస్వామ్యతను పెంచడంతోపాటు, టాలెంట్ అక్విజిషన్‌ను వేగవంతం చేస్తుంది.

పథకం ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త స్కీమ్ ప్రకారం, ప్రతి ఇంటర్వ్యూకు ఉద్యోగికి రూ.700 విలువైన 700 పాయింట్లు లభిస్తాయి. జనవరి 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పటి తర్వాత తీసుకున్న ఇంటర్వ్యూలకు కూడా ఈ పాయింట్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. జేఎల్5, జేఎల్6 స్థాయిలో ఉన్న ట్రాక్ లీడ్స్, ఆర్కిటెక్ట్స్, ప్రాజెక్ట్ మేనేజర్లు ఈ పథకానికి అర్హులు.
ఇంటర్వ్యూలు ఎక్కువగా, టెక్ స్కిల్స్‌పై ఫోకస్
సలీల్ పరేఖ్ నేతృత్వంలోని సంస్థ వారాంతాల్లో భారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. రోజుకు 10-15 ఇంటర్వ్యూల వరకు చేపడుతూ, పైథాన్, జావా, మెషిన్ లెర్నింగ్, డెవొప్స్ వంటి రంగాల్లో అభ్యర్థులను అంచనా వేస్తోంది. ఇది ఉత్తమ టాలెంట్‌ను పొందడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఎవరికి వర్తించదు?
హెచ్‌ఆర్ సిబ్బంది, టాలెంట్ అక్విజిషన్ టీమ్, కాంట్రాక్టర్లు, సీనియర్ లీడర్లు ఈ ప్రోత్సాహకానికి అర్హులు కావు. అలాగే రద్దయిన ఇంటర్వ్యూలకు లేదా అభ్యర్థులు హాజరుకాని సందర్భాల్లో ఈ రివార్డులు ఇవ్వబడవు.
Read Also : Trump: నా వలన భారత్, పాక్ మధ్య అణుయుద్ధం ఆగింది: ట్రంప్