అమెరికా డాలర్‌తో పోలిస్తే తాజాగా భారత రూపాయి విలువ కొంత మేర పుంజుకుంది. సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 26 పైసలు లాభపడి ₹89.1450 వద్ద ప్రారంభమైంది. ఇది గత శుక్రవారం ముగింపు ధర అయిన ₹89.4088తో పోలిస్తే మెరుగైన స్థాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రూపాయి విలువలో ఈ మెరుగుదలకు ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేసిన దృఢమైన జోక్యమే. ఇటీవల రూపాయి (Indian rupee) వరుసగా బలహీనపడుతున్న సమయంలో ఆర్‌బీఐ మార్కెట్లో చురుకుగా జోక్యం చేసుకోవడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలుపుతోంది.
Read also: Insurance: బీమా సంస్థల విలీనంపై కేంద్ర దృష్టి: పార్లమెంట్‌లో కొత్త బిల్లు?

RBI intervention
ఈ నెల 21న రూపాయి ₹89.49 వద్ద చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడులు భారీగా బయటకు వెళ్లడం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, ఆ సమయంలో ఆర్‌బీఐ సరైన సమయానికి స్పందించకపోవడం రూపాయి పడిపోవడానికి కారణమయ్యాయి.
విశ్లేషకుల అంచనా మేరకు,
“అమెరికా–భారత్ వాణిజ్య చర్చలు స్పష్టత లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దాంతో రూపాయి విలువ ఒక దశలో ₹89.60 వరకు క్షీణించింది” అని వారు పేర్కొన్నారు.
ఇకపై రూపాయి ₹89.20 – ₹90.00 శ్రేణిలో మార్పులు చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు పాజిటివ్ స్టార్ట్
రూపాయి బలపడిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
- సెన్సెక్స్ 122 పాయింట్లు పెరిగి 85,354 వద్ద
- నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 26,109 వద్ద ప్రారంభమయ్యాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: