హైదరాబాద్: వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా,(Vijay Mallya,) భారత ప్రభుత్వ రంగ బ్యాంకులను తీవ్రంగా విమర్శించారు. తన ఆస్తుల నుంచి బ్యాంకులు ఎంత రుణాన్ని రికవరీ చేశాయనే పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించడం లేదని, దీనికి బ్యాంకులు సిగ్గుపడాలి అని ఆయన అన్నారు. ఎక్స్ (X) వేదికగా ఓ పోస్టు పెడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా ₹14,100 కోట్లు రికవరీ చేసి, అవే బ్యాంకులకు చెల్లించినట్లు ప్రకటించినప్పటికీ, బ్యాంకులు మాత్రం రికవరీ అయిన మొత్తంపై కచ్చితమైన వివరాలను సమర్పించలేకపోవడం సిగ్గుచేటు అని మాల్యా రాసుకొచ్చారు.
Read Also: Vijay Raghavendra: సస్పెన్స్, థ్రిల్లర్ తో అమెజాన్ ప్రైమ్ లో కన్నడ సినిమా
రికవరీ వివరాలు ఇవ్వాలని డిమాండ్
ఈ పారదర్శకత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భారతీయ బ్యాంకులు పూర్తి రికవరీ వివరాలను బహిర్గతం చేసే వరకు తాను యునైటెడ్ కింగ్‌డమ్‌లో(United Kingdom) (బ్రిటన్) ఎలాంటి న్యాయపరమైన చర్యలను కొనసాగించబోనని మాల్యా స్పష్టం చేశారు. బ్యాంకులు నిజాయితీగా వ్యవహరించే వరకు తాను ఇంగ్లాండ్‌లో చట్టపరమైన చర్యలను అనుసరించనని వివరించారు. ఎందుకంటే తనకు ఒక సమర్థనీయమైన కౌంటర్ క్లెయిమ్ ఉందని, దానిపై భారతదేశంలో మాత్రమే తీర్పు చెప్పబడుతుందని మాల్యా పేర్కొన్నారు.

అధిక వసూళ్ల ఆరోపణలు, అకౌంట్ స్టేట్‌మెంట్లు
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి డబ్బులు వసూలు చేశాయని విజయ్ మాల్యా ఆరోపించారు. అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్‌లను అందించాలని ఆయన పలుమార్లు భారతీయ కోర్టులకు తెలియజేశారు. రికవరీ అధికారి సైతం తాను తీసుకున్న రుణంలో దాదాపు ₹10,200 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. తాను పూర్తి రుణం చెల్లించినప్పటికీ, ఇంకా రికవరీ ప్రక్రియ కొనసాగిస్తున్నారని, ఇది బ్యాంకులకు సిగ్గుచేటని మాల్యా మండిపడ్డారు.
మాల్యా నేపథ్యం
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(Kingfisher Airlines) రుణాల విషయంలో మోసం చేసినట్లు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 మార్చిలో దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన అప్పటి నుంచి బ్రిటన్‌లోనే నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
విజయ్ మాల్యా భారత బ్యాంకులపై చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?
తన ఆస్తుల నుంచి రికవరీ చేసిన రుణ వివరాలను బ్యాంకులు పారదర్శకంగా వెల్లడించడం లేదని ఆరోపించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత మొత్తం రికవరీ అయినట్లు ప్రకటించారు?
కేంద్ర ఆర్థిక మంత్రి రూ. 14,100 కోట్లు రికవరీ అయినట్లు ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: