2026 సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ IIFL క్యాపిటల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, RBI 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) వరకు వడ్డీ రేట్ల కోతకు వెళ్లవచ్చని అంచనా వేయబడుతోంది.
Read also: Samsung: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్
ఇప్పటికే 2025 సంవత్సరంలో RBI మొత్తం 1.25 శాతం మేర రేట్లను తగ్గించడంతో రెపో రేటు 5.25 శాతానికి చేరింది. ఈ పరిస్థితుల్లోనే 2026లో అదనపు తగ్గింపునకు అనుకూల వాతావరణం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే ముఖ్యంగా హోమ్ లోన్లు, ఆటో లోన్లు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

రెపో రేటు మరియు కోర్ ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, రెపో రేటు మరియు కోర్ ద్రవ్యోల్బణం మధ్య అంతరం పెరగడం వంటి అంశాలు RBIకి రేటు తగ్గింపునకు బలం చేకూర్చుతున్నాయి. ఆహార ధరల ఒడిదుడుకులు తగ్గడం, ఇంధన ధరలు స్థిరంగా ఉండడం కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు సహకరిస్తున్నాయని నివేదిక పేర్కొంది. వడ్డీ రేట్ల కోత ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనుందని, పెట్టుబడులు పెరగడంతో పాటు వినియోగ ఖర్చులు కూడా పెరుగుతాయని అంచనా. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాలకు ఇది ఊతం ఇవ్వనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, రేటు తగ్గింపులు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి, GDP(Gross domestic product) వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని IIFL క్యాపిటల్ తన నివేదికలో వెల్లడించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: