ఇప్పుడు మన జీవితంలో టైమ్ చాలా విలువైనది. అందుకే ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి ఎక్కువ మంది ఫ్లైట్‌ను ఎంచుకుంటారు. కానీ ఫ్లైట్ టికెట్ ధరలు (Flight ticket prices) మాత్రం అంత సులభంగా అందుబాటులో ఉండవు. చాలాసార్లు బడ్జెట్ మించి ఖర్చు అవుతుంది. మరి తక్కువ రేటుతో ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం సాధ్యమా? అవును. కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే టికెట్స్ చాలా తక్కువ రేటులో లభిస్తాయి.ఫ్లైట్ ఛార్జీలు డిమాండ్‌ను బట్టి మారుతాయి. పండుగలు, వీకెండ్స్ లేదా సెలవుల సమయంలో టికెట్స్ రేట్లు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తప్పించుకుని ట్రావెల్ ప్లాన్ (Travel plan) చేస్తే మంచి సేవింగ్ అవుతుంది. సాధారణంగా మంగళవారం, బుధవారం రోజుల్లో టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయి. అలాగే పబ్లిక్ హాలిడేస్ లేని సమయంలో బుక్ చేస్తే ఇంకా చౌకగా దొరుకుతాయి.

గూగుల్ ఫ్లైట్స్ ఉపయోగం
ఫ్లైట్ రేట్లను ట్రాక్ చేయడానికి ‘గూగుల్ ఫ్లైట్స్’ చాలా ఉపయోగకరం. మీరు ఎంచుకున్న రూట్, డేట్స్ ఇచ్చి అలర్ట్ సెట్ చేస్తే సరిపోతుంది. ధరలు తగ్గినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే బుక్ చేసుకోవడం ద్వారా మీరు తక్కువ ధరలో టికెట్ పొందవచ్చు.ఫ్లైట్ టికెట్స్ ఏ వెబ్‌సైట్‌లో చౌకగా ఉన్నాయో తెలుసుకోవడానికి ‘స్కైస్కానర్’ బెస్ట్ ఆప్షన్. ఇది వేర్వేరు ఎయిర్‌లైన్స్, బుకింగ్ సైట్స్ ధరలను పోల్చి చూపిస్తుంది. రెగ్యులర్‌గా ఫ్లైట్‌లో ట్రావెల్ చేసే వారికి ఈ టూల్ చాలా హెల్ప్ అవుతుంది. సరైన సమయం చూసుకుని స్కైస్కానర్ ద్వారా బుక్ చేస్తే మీరు ఎక్కువ డబ్బు సేవ్ చేసుకోవచ్చు.
ఇన్‌కాగ్నిటో మోడ్ సీక్రెట్
మీరు తరచూ ఫ్లైట్ రేట్లు సెర్చ్ చేస్తే బ్రౌజర్ ఆ డేటాను సేవ్ చేస్తుంది. దాంతో బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ధరలు ఆటోమేటిక్‌గా పెరగవచ్చు. దీన్ని తప్పించుకోవాలంటే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేయాలి. ఇలా చేస్తే మీ యాక్టివిటీ ట్రాక్ కానందువల్ల నిజమైన తక్కువ రేటు కనిపిస్తుంది.
రాత్రివేళల్లో బుకింగ్ ప్రయోజనం
చాలామందికి తెలియని ఒక సీక్రెట్ ఏమిటంటే రాత్రివేళల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత టికెట్స్ బుక్ చేస్తే ధరలు తక్కువగా ఉంటాయి. అలాగే రెగ్యులర్ ఫ్లైట్స్ కంటే నాన్‌స్టాప్ ఫ్లైట్స్ ధరలు చాలా సార్లు తక్కువగా ఉంటాయి. ఇవి కూడా ఒక ఆప్షన్‌గా ప్రయత్నించవచ్చు.ఫ్లైట్ టికెట్ రేట్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే మారిపోతాయి. అందుకే ప్లాన్ చేసే ముందు వేర్వేరు ప్లాట్‌ఫాంలను చెక్ చేసి, సరైన సమయాన్ని ఎంచుకుని బుక్ చేయాలి. గూగుల్ ఫ్లైట్స్, స్కైస్కానర్ వంటి టూల్స్ వాడటం, ఇన్‌కాగ్నిటోలో సెర్చ్ చేయడం, డిమాండ్ లేని రోజుల్లో ట్రావెల్ ప్లాన్ చేయడం వంటి చిన్న చిన్న ట్రిక్స్ మీకు మంచి సేవింగ్ ఇస్తాయి. మొత్తంగా చెప్పాలంటే, స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఖర్చును సగం వరకు తగ్గించుకోవచ్చు. ఇకమీదట ఫ్లైట్ ప్రయాణం ఖరీదు ఎక్కువ అనిపించుకోవాల్సిన అవసరం లేదు.
Read Also :