నేటి నుంచి కొత్త జీఎస్టీ – అమిత్ షా స్పందన దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) GST విధానంలో నేటి నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అత్యంత పెద్ద సంస్కరణగా ఈ మార్పులు చెరగని గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా Amit Shah ఈ సంస్కరణలపై స్పందిస్తూ, ప్రజలు, ప్రభుత్వం మధ్య నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థగా దీన్ని పేర్కొన్నారు.
కొత్త విధానం ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో కేవలం 5% మరియు 18% అనే రెండు శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఈ మార్పుల ద్వారా నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఆరోగ్య బీమా, Health insurance విద్యుత్, సిమెంట్, కారు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వంటి వస్తువులు చౌకగా లభిస్తాయి. అత్యంత విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించబడనుండగా, పొగాకు ఉత్పత్తులు పాత 28% ప్లస్ సెస్ పరిధిలో కొనసాగుతాయి.

GST
ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది.
అమిత్ షా ప్రకారం, “ఇది దేశంలో నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థకు నాంది పలుకుతుంది. పన్నులు కేవలం ప్రభుత్వ ఆదాయం కోసం వసూలు చేస్తారని ప్రజలలో ఉన్న భ్రమను తొలగిస్తుంది. దేశాన్ని నడిపేందుకు పన్నులు ఉపయోగపడతాయని ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది.” ఈ విధానం ఉత్పత్తి, వినియోగం రెండింటినీ ప్రోత్సహించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ జీఎస్టీ GST సంస్కరణలను ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ప్రధాన అడుగు అని అభివర్ణించారు. నవరాత్రుల మొదటి రోజున దేశంలో ‘జీఎస్టీ పొదుపు పండుగ’ ప్రారంభమవుతుందని, పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, వ్యాపారులు ఈ మార్పుల ద్వారా నేరుగా లాభపడతారని ఆయన చెప్పారు.
ప్రతిపక్షాల విమర్శలకూ అమిత్ షా స్పందించారు. “కొన్ని రాజకీయ నాయకులు జీఎస్టీని అవమానపరిచారు. ఇది విజయవంతమవుతున్నందున, తనకంటూ క్రియేటివ్ ఆలోచనగా ముందుకు వచ్చారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయలేకపోయారు?” అని ప్రశ్నించారు. ఆయన పేర్కొన్నారు, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలు రాజ్యాంగ హామీ కోరగా, మోదీ ప్రభుత్వం ఆ హామీని ఇచ్చి రాష్ట్రాల నమ్మకాన్ని పెంపొందించడంతో జీఎస్టీ విజయవంతమైందని స్పష్టం చేశారు.
కొత్త జీఎస్టీ నేటి నుంచి ఏ విధంగా అమల్లోకి వస్తుంది?
ఇప్పటికే ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో కేవలం 5% మరియు 18% రెండు శ్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయి.
ఈ జీఎస్టీ మార్పుల ప్రాముఖ్యత ఏమిటి?
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పెంచడం, ఉత్పత్తి మరియు వినియోగాన్ని ప్రోత్సహించడం, పన్నుల వ్యవస్థను సులభతరం చేయడం ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: