VI : ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం ఫోన్ కాల్స్, SMSలు మాత్రమే ఉపయోగించుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం చాలామంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ డేటాను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, కొందరు మాత్రం కేవలం ఫోన్ కాల్స్, సందేశాల కోసమే మొబైల్ సేవలను వినియోగిస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని Vi ఈ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. గతంలో ఎయిర్‌టెల్ కూడా ఇదే తరహా వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు Vi సైతం ఆ బాటలో నడుస్తోంది. దీంతో అనవసరంగా డేటా కోసం అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు ప్రత్యామ్నాయం లభించనుంది.
Read Also : చలో ఢిల్లీ ర్యాలీ వాయిదా వేయాలని సోనియాకు వ్యాపారుల లేఖ!

రూ.179 నుంచి రీఛార్జ్ ప్లాన్లు.. కాలింగ్, SMS సదుపాయాలు
Vi తీసుకొచ్చిన వాయిస్ ఓన్లీ ప్లాన్లలో వివిధ ధరలు, వ్యాలిడిటీతో కూడిన ఆప్షన్లు ఉన్నాయి. రూ.185 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్‌తో పాటు 300 SMSలు పొందవచ్చు. రూ.203 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, 300 SMSలు అందుబాటులో ఉంటాయి. అలాగే రూ.206 ప్లాన్‌తో ఒక నెల పాటు అపరిమిత కాలింగ్, 300 SMSల సదుపాయం లభిస్తుంది. ఇక రూ.179 ప్లాన్‌లో 25 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సదుపాయం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్లు ముఖ్యంగా డేటా వినియోగం తక్కువగా ఉండే సీనియర్ సిటిజన్లు, సాధారణ ఫోన్ వినియోగదారులు, కాల్స్‌కే ప్రాధాన్యత ఇచ్చేవారికి ఉపయోగకరంగా ఉండనున్నాయి. అయితే రీఛార్జ్ చేసుకునే ముందు తమ సర్కిల్‌లో ప్లాన్ లభ్యత, ఇతర నిబంధనలను Vi అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో పరిశీలించడం మంచిది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :