OnePlus 13 ధర తగ్గింపు: కీలక స్పెసిఫికేషన్లు, ఆఫర్లు ఇవే
ఒకవైపు కొత్త మోడల్ లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు వన్ ప్లస్(OnePlus) 13పై భారీ ధర తగ్గింపుతో వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్‌లో వచ్చిన తాజా తగ్గింపుతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ దాదాపు రూ. 10,000 చౌకైంది. OnePlus 15 త్వరలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ధర తగ్గింపు చేపట్టినట్లు తెలుస్తోంది.
ధర తగ్గింపుకు కారణం
వన్ ప్లస్(OnePlus) 15 నవంబర్ 13న మార్కెట్లోకి రావచ్చని సమాచారం. దీని వల్ల OnePlus 13పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ప్రారంభంలో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అయిన ఈ మోడల్ 12GB RAM + 256GB స్టోరేజ్ మరియు 16GB RAM + 512GB స్టోరేజ్ ప్రారంభ ధర రూ. 72,999. తాజా ఆఫర్లతో కనీసం రూ. 9,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా రూ. 1,500 బ్యాంకు డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది.
Read Also: Avihitham: ‘అవిహితం’ మూవీ రివ్యూ!

ఫోన్ ముఖ్య ఫీచర్లు
- OnePlus 13 పటిష్టమైన Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.
- 6.82 అంగుళాల 120Hz AMOLED ProXDR డిస్‌ప్లే మరింత స్పష్టతను అందిస్తుంది.
- గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజ్ వరకు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- దీర్ఘకాలం పని చేసే 6000mAh బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ వైడ్ యాంగిల్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటోతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.
- సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా.
- నీరు, ధూళి నుండి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్.
- ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పై నడుస్తుంది.
OnePlus 15 రాక ముందు OnePlus 13పై లభిస్తున్న ఈ భారీ డిస్కౌంట్ వినియోగదారులకు మంచి అవకాశమని చెప్పాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: