ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయి మళ్లీ పెరుగుతున్నాయి. కొనుగోలు దారులు బంగారం కొనాలావద్దా,అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే పసిడి ధరలు భవిష్యత్తులో తగ్గితే బాగుంటుందని అనేకులుభావిస్తున్నారు. దీనిపై ఆర్థిక నిపుణులు ఏం అంటున్నారో గమనిద్దాం.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తగ్గే అవకాశాలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి అధిక రిస్క్ కలిగిన ఆస్తులపై దృష్టి సారిస్తే పసిడి ధలు తగ్గుతాయి. స్టాక్ మార్కెట్లు (Stock markets) పుంజుకున్న కాలంలో లేదా ఆర్థిక లోటు లేని సమయంలోపెట్టుబడిదారులు పసిడి మీద మోజు చూపరు. తద్వారా ధరలు తగ్గుతాయి. ఇక మరో అంశం ఏంటంటే,అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరిగితే ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం ఖరీదైనవస్తువుగా మారుతుంది. బంగారాన్ని డాలర్లలో కొనడానికి ఇష్టపడరు తద్వారా కూడా బంగారం ధరలుతగ్గుతాయి.

ఆర్బీఐ వడ్డీరేట్లు మార్పులు
ఆర్బీఐ వడ్డీరేట్లు మార్పులు చేసే సమయంలో కూడా బంగారం ధరలు తగ్గుతాయి. అధిక రాబడి కోసంపెట్టుబడిదారులు బంగారాన్ని వదిలేసి బ్యాంక్ డిపాజిట్లు (Bank deposits), బాండ్లు వంటివాటిల్లో తమ పెట్టుబడులనుపెడతారు. బంగారాన్ని విక్రయించి వడ్డీ ఇచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తారు.దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.
బంగారానికి డిమాండ్ ఎందుకు?
బంగారానికి డిమాండ్ రావడానికి భారత్, చైనాలే కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ దేశాలు ఏశుభకార్యానికి అయినా బంగారాన్ని (Gold) అధికంగా కొనుగోలు చేస్తుంటారు. సామాన్యులకు తక్కువ ధరకుఅందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం పండుగుల సీజన్ తోపాటు త్వరలో శ్రావణమాసం కూడా ఆరంభంకానున్నది. శుభకార్యాలకు అనుకూలం కావడంతో బంగారం కొనుగోలు పెరుగుతుంది. తద్వారా పసిడికి డిమాండ్ పెరిగి, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
బంగారం యొక్క నిజమైన పేరు ఏమిటి?
బంగారానికి శాస్త్రీయంగా ఉన్న పేరు “ఆరమ్” (Aurum). ఇది లాటిన్ భాషలో బంగారం అనే అర్ధంతో ఉపయోగించబడింది.
ఏ దేశం యొక్క బంగారం అసలైనదిగా (అధిక నాణ్యతగా) పరిగణించబడుతుంది?
బంగారం నాణ్యత పరంగా స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా,కెనడా దేశాలు అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఉత్పత్తయ్యే బంగారం అధిక శుద్ధి (High Purity) కలిగి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Black mass: బ్లాక్ మాస్ ఎగుమతులపై భారత్ ఆంక్షలు.. చైనాకు భారీషాక్