Gold Rate Today: రోజురోజుకీ పసిడి ధరలు దిగివస్తుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ (మార్చి 6, శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. విశేషమేమిటంటే, ఒకే రోజులో పసిడి రేట్లు రెండోసారి పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగానూ ధరలు తగ్గుముఖం పట్టాయి.
Read Also: Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నేటి బంగారం ధరల వివరాలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఒక్క రోజులోనే ఏకంగా 1,750 రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై ఒక్క రోజులోనే 1600 వరకు దిగి వచ్చింది. ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,130 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,700 వద్ద కొనసాగుతున్నాయి.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపినప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగితే ధరలు తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన తర్వాత ప్రస్తుతం కొంత మేర తగ్గుదల కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: