జర్మన్(German Cars) లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW) తన ప్రసిద్ధ రౌండ్ లోగోకు నిశ్శబ్దంగా కొత్త రూపాన్ని ఇచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఈ అప్‌డేటెడ్ లోగోను పరిచయం చేయడం గమనార్హం. తొలిసారిగా 2025 సెప్టెంబర్‌లో విడుదలైన iX3 మోడల్‌లో ఈ కొత్త లోగో కనిపించగా, ఫిబ్రవరి నుంచి అన్ని బీఎండబ్ల్యూ కార్లపై దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం.
Read Also: Budget 2026: ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు? ధరలు తగ్గే అవకాశం!

ఏమేం మారాయి?
కొత్త లోగోలో బ్లూ, వైట్ రంగాలను(German Cars) వేరు చేసే క్రోమ్ రింగ్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే BMW అక్షరాలను మరింత సన్నగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. మొత్తం లోగో బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్‌తో స్టైలిష్‌గా కనిపిస్తోంది.
ఈ మార్పులపై స్పందించిన బీఎండబ్ల్యూ డిజైన్ హెడ్ ఆలివర్ హీల్మెర్, బ్రాండ్ వారసత్వాన్ని కాపాడుతూ, మరింత స్పష్టత మరియు ఆధునికత తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ఈ కొత్త లోగోతో కూడిన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారత మార్కెట్లో కూడా ఈ కొత్త బీఎండబ్ల్యూ లోగోతో కార్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: