దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Ev Cars) మార్కెట్ గత కొంతకాలంగా మందగమనం ఎదుర్కొంటోంది. అమ్మకాలు తగ్గిపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు స్టాక్‌ను క్లియర్ చేయడం, కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం భారీ ఇయర్‌ఎండ్ డిస్కౌంట్లను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హ్యూందాయ్, కియా, ఎంజీ వంటి కంపెనీలు తమ ఈవీ మోడళ్లపై లక్షల్లో తగ్గింపులు ఇస్తూ వినియోగదారులకు పెద్ద ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీ తగ్గడంతో వాటి ధరలు తగ్గాయి. అందువల్ల కస్టమర్లు తిరిగి ఫ్యుయల్ కార్ల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీని ప్రభావం ఈవీ అమ్మకాలపై స్పష్టంగా కనిపించడంతో, కంపెనీలు సంవత్సరం చివరలో అమ్మకాలను పుంజుకునేలా ఈ భారీ డిస్కౌంట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.
Read also: GHMCలో కొత్త వార్డుల సంఖ్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం

టాటా, మహీంద్రా భారీ ఆఫర్లు
ఈవీ సెగ్మెంట్‌లో(Ev Cars) అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్(Tata Motors) తమ మోస్ట్ సెల్లింగ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కర్వ్ ఆర్‌ఎస్ మోడల్‌పై గరిష్టంగా ₹3.50 లక్షల ఆఫర్, పంచ్ ఈవీపై ₹1.75 లక్షలు, నెక్సాన్ ఈవీపై ₹1.50 లక్షలు, టియాగో ఈవీపై ₹1.65 లక్షల తగ్గింపు. మహీంద్రా కంపెనీ కూడా పోటీలోకి దిగింది. XUV 9eపై ₹3.50 లక్షలు, BE6 మోడల్‌పై ₹2.50 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది.
హ్యూందాయ్, కియా, ఎంజీ భారీ తగ్గింపులు
హ్యూందాయ్ తన ప్రీమియం ఈవీ మోడల్ IONIQ 6పై ఏకంగా ₹7 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది. ఇది ఇప్పటి వరకు ఈవీ మార్కెట్లో అత్యంత పెద్ద డిస్కౌంట్లలో ఒకటి. కియా తన EV6పై ₹1.20 లక్షల బెనిఫిట్ అందిస్తోంది. ఎంజీ మోటార్స్ తమ కామెట్ ఈవీపై ₹1 లక్ష, ZS ఈవీపై ₹1.35 లక్షల వరకు ప్రయోజనాలు ఇస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి పలు ప్రయోజనాలను కంపెనీలు కలిపి అందిస్తున్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే భారీగా సేవింగ్స్ పొందే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: