హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్(Elections code) అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తగిన ఆధారాలు లేకుండా నగదుతో పాటు నగలు, ఇతర వస్తువుల తరలింపును ఆపేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేబట్టారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ యోజకవర్గానికి ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సర్పంచి, ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు జరగనుం డడం తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైద రాబాద్ సహా అన్నిచోట్ల పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను ఆపుతూ సోదాలు చేబడుతున్నారు.
Read Also: Vijay: బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతికై విజయ్ విజ్ఞప్తి

సోమవారం నుంచి మొదలైన వాహనాల తని ఖీలు(Vehicle inspections)మంగళవారం ముమ్మరంగా పెరిగాయి. ట్రై కమిషనరేట్లలోని అన్ని రహదా రులతో పాటు జిల్లాలోని జాతీయ రహదారులపై సాయుధ పోలీసుల పహారాతో ఆయా ప్రాంతాల పోలీసులు వాహనాలను ఆపుతూ తనిఖీలు చేస్తున్నారు. కొన్నిచోట్ల 50 వేల రూపాయలకు మించి నగదు తరలిస్తున్న వ్యక్తులు లేదా వ్యాపారుల నుంచి డబ్బులను పోలీసులు జప్తు చేసినట్లు డిజిపి కార్యాలయానికి సమాచారం అందింది. నగదుతో పాటు తగిన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న నగలను కూడా పోలీ సులు కొన్నిచోట్ల జప్తు చేసే నట్లు సమాచారం.
ఎన్నికల కోడ్అమల్లో(Elections code) వున్నం దున పెద్ద మొత్తంలో నగదు తరలించడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ఆయా ప్రాంతాల పోలీసులు వ్యాపారులకు చెబుతు న్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ అవసరాల కోసం భారీగా నగదు తరలించాలంటే తప్పనిసరిగా తగిన అనుమతి పత్రాలు వెంట తెచ్చుకోవాలని పోలీసులు తెలిపారు. బ్యాంకులతో పాటు ఎటిఎంలకు నగదు తరలించే సంస్థలు కచ్చితంగా తగిన అనుమతి పత్రాలు వెంట తీసుకువెళ్లాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరితో పాటు మద్యం వ్యాపారులు, ఇతర వ్యాపారాలు కలిగి పెద్ద మొత్తంలో నగదు తరలించే వారు కూడా నిబంధనలను పాటించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. ఎన్నికల కోడ్ అ మల్లో వున్న సమయంలో అనుమతులు లేని డబ్బులు లేదా నగలు, ఇతర విలువైన వస్తువులు పట్టుబడితే కోడ్ ఎత్తేసిన తరువాతే ఇవ్వడం జరు గుతుందని పోలీసులు తెలిపారు.
హవాలారాయుళ్లపై పోలీసుల నిఘా: ఇదిలా వుండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో హవాలారాయుళ్లపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. అ రాష్ట్రంలో ఎన్నికల వేళ హవాలా ద్వారా నగ దును తరలించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. హైదరాబాద్ సహా దేశంలోని నలు నగరాల నుంచి వీటి నిర్వాహకులు కార్యకలాపాలు చేస్తుండగా వారి తరపున ఆయా ప్రాంతాల ఏజెంట్లు ముందుగా అందిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాలలోని వ్యక్తులకు కోరినంత నగదు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. అయితే హవాలా ద్వారా నగదు తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా నిఘా వుంచుతారు. ఇందుకోసం ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం, పాత నేరగాళ్లపై నిఘా వుంచడం వంటివి చేస్తుంటారు. ఈసారి కూడా ఇదేవిధంగా వ్యవహరించి హవాలారాయుళ్ల భరతం పట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: