దీపావళి Diwali పండుగను మరింత ప్రత్యేకంగా మార్చడానికి Elite Mark కంపెనీ ఉద్యోగులకు సుప్రసిద్ధ బహుమతి ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఉద్యోగులందరికీ ఏకంగా తొమ్మిది రోజుల సెలవులు Diwali Holidays ప్రకటించారు. కంపెనీ స్పష్టం చేసినట్లుగా, ఈ సెలవుల్లో ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా ఎలాంటి పని పిలుపు ఉండవు. అంటే, ఉద్యోగులు పూర్తి విశ్రాంతి తో పండుగను కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. Elite Mark సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రజత్ గ్రోవర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు సుదీర్ఘ సెలవులు ఉంటాయని ఉద్యోగులకు (Employes) మెయిల్ పంపారు. యాజమాన్యం ప్రకారం, ఈ ప్రకటన ద్వారా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం ఉంది. దీపావళి కుటుంబ పండుగ కాబట్టి, పని నుంచి పూర్తి విరామం లభిస్తే, ఉద్యోగులు మరింత ఉత్సాహంతో తిరిగి పనికి వచ్చే అవకాశం ఉంది.
China and Trump : చైనా మమ్మల్ని మోసం చేసింది

Diwali Holidays
ఈ వార్త లింక్డిన్‌లో (Linkedin) ఒక ఉద్యోగి పోస్టు చేయడంతో వైరల్ అయింది. Diwali Holidays పలువురు నిపుణులు, ఇతర కార్పొరేట్ సంస్థలకు కూడా ఈ విధానం ఒక ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. నిజంగా, అసలు “పండుగ బంపర్ గిఫ్ట్” అంటే ఇదేనని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: